📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Gaza Peace Plan : గాజా శాంతి ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం

Author Icon By Sudha
Updated: November 18, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Peace Plan) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి ముగింపుపలికేందుకు 20 సూత్రాల ప్రణాళికను డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ బలగాల నియోగం, యుద్ధ విరామం, పునర్నిర్మాణం, పాలనకు మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఈజ్రాయెల్‌-పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్‌ గత నెల 10న సంతకాలు చేశాయి. ఐక్యరాజ్యసమితో సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు గాజా శాంతి ప్రణాళికకు (Gaza Peace Plan) మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. గత నెలలో యుద్ధ విరామం, బందీల విడుదల ఒప్పందంతో ప్రణాళిక మొదటి దశను అమలు చేసిన సంగతి తెలిసిందే. బోర్డ్ ఆఫ్ పీస్ అనే తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి.. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాలన్నది గాజా ప్లాన్‌ ఉద్దేశం.

Read Also : America: భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ అడ్మిషన్లు

Gaza Peace Plan

కాగా, ఈ తీర్మానాన్ని హమాస్‌ ఖండించింది. ఇది గాజా ప్రజల స్వతంత్రతను హరించడమేనని మండిపడింది. పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్యం, స్వయంపాలన హక్కులను ఈ తీర్మానం గౌరవించడంలేదని, ఇక్కడి ప్రజల రాజకీయ ఆకాంక్షలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా సంస్థ పేరుతో ఇతర దేశాల నిర్ణయాలను రుద్దే ప్రయత్నంగా కనిపిస్తున్నదని విమర్శించింది. గాజా భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలని, విదేశీ బలగాలు, పాలనా సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్‌ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడికి దిగింది. దాదాపు 1,200 మందిని హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకుంది. హమాస్‌ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల్లో 67,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాదిమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు.

గాజా శాంతి ప్రణాళిక ఏమిటి?

గాజా శాంతి ప్రణాళిక అనేది ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరిగిన బహుపాక్షిక ఒప్పందం, ఇది కొనసాగుతున్న గాజా యుద్ధం మరియు విస్తృత మధ్యప్రాచ్య సంక్షోభాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో, అనేక అరబ్ మరియు ముస్లిం దేశాలతో సంప్రదించి దీనిపై చర్చలు జరిగాయి.

గాజా శాంతి సమావేశంలో ఎవరున్నారు?

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్-సిసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతారీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని మరియు టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అందరూ “శాశ్వత శాంతి మరియు శ్రేయస్సు కోసం ట్రంప్ ప్రకటన” అని పిలువబడే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అయితే, ఇజ్రాయెల్ మరియు హమాస్ ప్రతినిధులు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Gaza International Relations latest news Middle East Peace Plan Telugu News UN Security Council

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.