📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Isarel: గాజా శాంతి ఒప్పందం.. పాక్ ప్రజల్లో ఆగ్రహం ఎందుకు?

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. పరస్పర భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్, గాజా(Gaza)లలో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. దీనితో యుద్ధం ముగిసింది. అయితే ఈ ఒప్పందంపై పాకిస్తాన్‌ భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన సంఘటనల ప్రకారం, గాజా శాంతి ఒప్పందం (ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-అంశాల ప్రణాళిక)నికి పాకిస్తాన్ మొదట్లో మద్దతు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దేశీయ ఒత్తిడి కారణంగా వ్యతిరేకతగా మారింది. పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి.

Read Also: Giorgia Meloni: పొగతాగడం మానేస్తే నాకు చిరాకు ఎక్కువవుతుంది: మెలోనీ

గాజా శాంతి ఒప్పందం.. పాక్ ప్రజల్లో ఆగ్రహం ఎందుకు?

దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ , ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా పాకిస్తాన్ పాలకులు మొదట ఈ శాంతి ప్రణాళికను స్వాగతించారు. మద్దతు తెలిపారు. అయితే, ఈ ప్రకటనపై పాకిస్తాన్‌లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాన్య కార్యకర్తలు ఈ ప్రణాళిక పాలస్తీనా రాజ్యానికి వ్యతిరేకంగా ఉందని, అమెరికాకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ తీవ్రమైన అంతర్గత ఒత్తిడి కారణంగా, పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలోనే తమ వైఖరిని మార్చుకుంది (యూటర్న్ తీసుకుంది). ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ట్రంప్ ప్రకటించిన 20-అంశాల ప్రణాళిక ముస్లిం దేశాలు ప్రతిపాదించిన అసలు ముసాయిదా కాదని , తమ ముసాయిదాలో మార్పులు జరిగాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మాజీ రాయబారులు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పాలస్తీనా దేశం ఏర్పడాలని పాకిస్తాన్ డిమాండ్

పాకిస్తాన్ విదేశాంగ విధానం ఎల్లప్పుడూ పాలస్తీనాకు మద్దతుగా ఉంటుంది. 1967 పూర్వ సరిహద్దులతో, తూర్పు జెరూసలేం (అల్-ఖుద్స్ అల్-షరీఫ్) రాజధానిగా ఒక సార్వభౌమ ,ఆచరణీయమైన పాలస్తీనా దేశం ఏర్పడాలని పాకిస్తాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. అందువల్ల శాంతి ప్రణాళిక ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉందనే భావన వ్యతిరేకతకు దారితీసింది.ట్రంప్ ప్రతిపాదిత గాజా శాంతి ప్రణాళికకు పాకిస్తాన్‌ మద్దతివ్వడం దీర్ఘకాలంగా ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరికి భిన్నంగా ఉందని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి చెప్పారు.”పాకిస్తాన్‌లో ప్రజల స్పందన వ్యతిరేకంగా ఉంది” అని మలిహా లోధి జర్మన్ వార్తా సంస్థ డీడబ్ల్యూతో చెప్పారు.‘‘ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అస్పష్టంగా ఉంది.

గాజాకు కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటుకు డిమాండ్

ట్రంప్ ప్రణాళికలో పాకిస్తాన్‌లోని తీవ్రవాద సంస్థలు (ముఖ్యంగా తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ – TLP) ఇతర సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కారణం ఈ ప్రణాళికలో హమాస్ ఆయుధాలు వీడాలని, గాజాకు కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉంది. హమాస్ నిరాయుధీకరణకు పాకిస్తాన్‌లోని మితవాద. అతివాద వర్గాలు అంగీకరించడం లేదు.గాజా పాలన కోసం ఏర్పాటు చేసే సంస్థకు అమెరికా అధిపత్యం వహిస్తుందనే అంశం కూడా విమర్శలకు గురైంది.
సంక్షిప్తంగా, పాకిస్తాన్ ప్రభుత్వం మొదట ఒప్పందాన్ని అంగీకరించినా, పాలస్తీనాకు సంబంధించిన కీలక డిమాండ్లను విస్మరించిందనే ఆరోపణలు ,అంతర్గత రాజకీయ ఒత్తిడి కారణంగా అది యూటర్న్ తీసుకుని ఒప్పందాన్ని వ్యతిరేకించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Gaza Conflict Gaza peace deal International Relations Latest News Breaking News Middle East Politics Pakistan Anger Pakistan public reaction peace agreement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.