📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌

Author Icon By Sudha
Updated: October 9, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజా లో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. శాంతి ఒప్పందంపై (Gaza Peace Deal) ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.హమాస్‌ చేతిలో బందీగా ఉన్నవారంతా త్వరలోనే విడుదల అవుతారని ఈ సందర్భంగా ట్రంప్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని ట్రంప్‌ ప్రకటించారు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన జరగడానికి యూఎస్‌తో పాటు కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్‌, ఈజిప్ట్‌, తుర్కియేకి ట్రంప్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌

మరోవైపు శాంతి ఒప్పందాన్ని హమాస్‌ సైతం ధ్రువీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. గాజాలో యుద్ధం ముగింపుకు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించిన 20 సూత్రాల శాంతి (Gaza Peace Deal)ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ ఫార్ములాను భారత్‌ సహా పలు దేశాలు స్వాగతించాయి. ట్రంప్‌ ఫార్ములాకు ఇజ్రాయెల్‌, హమాస్‌ కూడా అంగీకారం తెలిపాయి. తాజాగా ఆ దిశగా తొలి అడుగు పడింది.

గాజా ఒప్పందం అంటే ఏమిటి?

ప్రారంభ ప్రతిపాదన మూడు దశల్లో వరుస చొరవ, ఆరు వారాల కాల్పుల విరమణతో ప్రారంభమైంది మరియు ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న వందలాది మంది పాలస్తీనియన్లకు బదులుగా గాజాలో బందీలుగా ఉన్న అన్ని ఇజ్రాయెలీయులను విడుదల చేయడం, యుద్ధానికి ముగింపు, గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ ఉపసంహరణ మరియు పునర్నిర్మాణ ప్రక్రియ.

గాజా ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నారు?

ఈ ప్రతిపాదనను మొదట యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తులు రూపొందించారు, దీనిని హమాస్ మే 5, 2024న ఆమోదించింది మరియు మే 31న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దీనిని సమర్పించారు. జూన్ 10న, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దీనిని తీర్మానం 2735గా ఆమోదించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Breaking News Gaza Hamas israel latest news Middle East Peace Deal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.