రెండేళ్ల తర్వాతలో ఆనందాల వేడుక గాజాలో ఎక్కడ చూసిన యుద్ధం ఛాయలే కనిపిస్తాయి. రెండేళ్లుగా నిత్యం బాంబుల దాడులతో ఆ పట్టణమంతా బూడిదదిబ్బగా మారిపోయింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది. శిథిలమైపోయిన భవంతులు, కనుమరుగైపోయిన పారిశుద్ధ విధానంతో అపరిశుభ్రతే తప్ప అందమైన ప్రదేశాలు కానీ, పరిశుభ్రత అనేది కనిపించదు.
Read Also: Russia: భారత్ లో పర్యటించనున్న పుతిన్.. కీలక ఒప్పందంపై రష్యా ఆమోదం!
ఇక ప్రజల జీవినవిధానమైతే కడుదయనీయంగా మారింది. తినేందుకు తిండిలేక, తాగేందుకు నీరులేక ఎంతోమంది మరణించారు. బాంబుల దాడిలో చాలామంది మరణించారు. ఆకలిచావులతో కూడా కొందరు చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గొప్ప మనసు, పట్టుదల వల్ల ఇజ్రాయెల్, హమాస్ లమధ్య యుద్ధం ఆగిపోయింది. దీంతో తిరిగి గాజాలో మునుపటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు మళ్లీ తమ ప్రశాంత జీవనానికి అడుగులు
వేస్తున్నారు. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మంగళవారం పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో గాజాలో సందడి వాతావరణం నెలకొంది.
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన 54 జంటలు
గాజాలో (GAZA) మంగళవారం 54జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాయి. గాజాలోని ఖాన్ యూనిస్ లోని హమద్ నగర్ లో జరిగిన వేడుకలో 54 పాలస్తీనా జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుక సందడి సందడిగా సాగంది. గాజాలో 2 మిలియన్ల మంది నివాసం ఉంటున్నారు. యుద్ధం కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు.
ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడులతో భవనాలు నేలమట్టం అయ్యాయి. యుద్ధ సమయంలో బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉండటంతో తిరిగి ఇళ్లకు వచ్చి వివాహాలు చేసుకుంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: