📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaza : గాజాపై ఐడీఎఫ్ విజృంభణ.. 42 మంది పాలస్తీనియన్ల మృతి

Author Icon By Sudha
Updated: July 5, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఐడీఎఫ్‌ జరుపుతున్న ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజా(Gaza)పై ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన వైమానిక దాడులు, కాల్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న దాదాపు 42 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గాజా ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేసినట్లు పేర్కొంది. తాజా దాడుల్లో అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై వెంటనే చర్చలు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్‌ ప్రకటించింది.

Gaza : గాజాపై ఐడీఎఫ్ విజృంభణ 42 మంది పాలస్తీనియన్ల మృతి

ఆకలి బాధలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 58 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. గాజా అంశంలో త‌మ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చ‌ర్చలు చేప‌ట్టార‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపిన విషయం తెలిసిందే. గాజాలో 60 రోజుల కాల్పుల విర‌మ‌ణ‌కు ఇజ్రాయెల్ అంగీక‌రించింద‌ని, ఆ స‌మ‌యంలో అన్ని పార్టీల‌తో క‌లిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయ‌త్నిస్తామ‌న్నారు. శాంతి ఒప్పందం కోసం ఖ‌తార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయ‌త్నించాయ‌ని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాద‌న చేస్తార‌న్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హ‌మాస్ ఆ ఒప్పందాన్ని అంగీక‌రిస్తుంద‌ని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్‌ సంస్థ తెలిపింది.
తుడిచిపెట్టేస్తాం
గాజా (Gaza)లో 60 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ పాటించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రకటన వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు. ‘హమాస్‌ ఉండదు.. హమస్థాన్‌ ఉండదు. ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని వ్యాఖ్యానించారు.

Read Also: hindi.vaartha.com

Read Also: Masood Azar: పాకిస్థాన్‌కు మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడో

#Gaza #GazaConflict #HumanRights #IDF #Israel #IsraelHamasConflictgaza news #MiddleEast #Palestine #PalestinianLives #WarUpdates Breaking News in Telugu gaza death toll Gaza Humanitarian Crisis gaza latest updates Google news Google News in Telugu idf gaza attacks idf strikes Israel Hamas war Latest News in Telugu middle east conflict palestine israel news palestinians killed Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.