📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaza: గాజాలో మళ్లీ భీకర దాడులు..ఆగని హింస

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజా స్ట్రిప్‌(Gaza Strips)లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్(Israel) భద్రతా దళాలు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియ(palestine)న్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్‌(Hamas)ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులను తీవ్రతరం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి

ఒకవైపు ఈ హింస కొనసాగుతుండగానే, మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చించారు.

Gaza: గాజాలో మళ్లీ భీకర దాడులు..ఆగని హింస

చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు

గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఈ సమయంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నిస్తామని ట్రంప్ తెలిపారు. ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో తుది ప్రతిపాదన సిద్ధమవుతోందని, మిడిల్ఈస్ట్ శ్రేయస్సు కోసం హమాస్ దీనికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, గాజాపై యుద్ధాన్ని శాశ్వతంగా ఆపితేనే ఎలాంటి ఒప్పందానికైనా అంగీకరిస్తామని హమాస్ స్పష్టం చేసింది. దీంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించడంతో ఈ యుద్ధం

2023 అక్టోబర్‌లో హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించడంతో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 58 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులై, తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. రష్యా- ఉక్రెయిన్ మధ్యలో అమెరికా వస్తే.. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది. శాంతి చర్చలను కోరుకుంటున్న ట్రంప్.. ఆయుధాలు ఎలా పంపిస్తారని ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఎటువైపునకు దారి తీస్తుందోనని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య కథ ఏమిటి?
1948లో ప్రారంభమైన ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో గాజా-ఇజ్రాయెల్ వివాదం స్థానికీకరించిన భాగం, పారిపోయిన లేదా వారి ఇళ్ల నుండి బహిష్కరించబడిన 700,000 కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లలో దాదాపు 200,000 మంది గాజా స్ట్రిప్‌లో శరణార్థులుగా స్థిరపడ్డారు.
ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య పోరాటానికి కారణం ఏమిటి?
ఈ వివాదంలో ముఖ్యమైన అంశాలు వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ఆక్రమణ, జెరూసలేం స్థితి, ఇజ్రాయెల్ స్థావరాలు..

Read hindi news: hindi.vaartha.com

read also: Microsoft: భారీగా లేఆఫ్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

#telugu News Gaza airstrikes Gaza attacks Gaza civilian casualties Gaza violence Israel Gaza Conflict Latest News Breaking News Middle East crisis ongoing violence Gaza Palestine conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.