📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaurav Chintamanidi: అమెరికాలో ఉద్యోగం పూలపాన్పు కాదు..ఓ భారతీయుడి ఆవేదన

Author Icon By Sharanya
Updated: June 21, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)— విద్యార్థుల కలల భూమి. ఆగ్రదేశంలోని అగ్ర విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అక్కడే స్థిరపడాలని లక్షలాది మంది భారతీయ యువత ఆశపడతారు. ఒక్కసారి స్టూడెంట్ వీసా రావడమే ఒక విజయగాధగా భావించి, విద్య పూర్తయ్యాక ఉద్యోగం చేసి, మంచి జీవనశైలి గడిపే కలలతో ముందుకెళ్తారు. అయితే ఆ కలలు ఓ ముద్దుబొమ్మలా మాత్రమే ఉంటాయే తప్ప, వాస్తవికత మాత్రం చాలా రకంగా ఉంటుందని తాజాగా ఓ భారతీయ యువకుడు — గౌరవ్ చింతమనీడి (Gaurav Chintamanidi) తన అనుభవాల ద్వారా తెలియజేశాడు. లింక్డ్ ఇన్ లో చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.

విద్య నుంచి వృత్తి జీవితం దాకా – మారిన దృశ్యం

చాప్‌మన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఉద్యోగ జీవితంలో మొదటి ఏడాది తాను పడిన మానసిక, శారీరక ఒత్తిడి గురించి వివరించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత దేశంలో సగం దూరం ప్రయాణించి కొత్త నగరానికి వెళ్లడం తన జీవితంలో “అత్యంత సవాలుతో కూడుకున్న” సమయాల్లో ఒకటని గౌరవ్ తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలో అసిస్టెంట్ స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన, వారానికి 60 గంటల వరకు పనిచేస్తున్నానని, ఇది తాను కాలేజీ తర్వాత ఊహించుకున్న జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మానసిక ఒత్తిడి – ఒంటరితనం

అతని వ్యాఖ్యలు వాస్తవంగా చూస్తే అమెరికా (America)లో ఉద్యోగం అనేది ఒక్క ఊపిరితో కూడిన వెచ్చని జీవితం కాదు. “నేను డీఎంవీ ప్రాంతానికి వచ్చినప్పుడు, టీవీలో చూసే లేదా సోషల్ మీడియాలో ఊహించుకునే 20 ఏళ్ల తొలి దశ జీవితాన్ని గడుపుతానని అనుకున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, పని తర్వాత సహోద్యోగులతో డ్రింక్స్, మెట్రోలో అపరిచితులతో మాటలు కలిపి స్నేహితులుగా మార్చుకోవడం వంటివి ఊహించుకున్నాను. వారాంతాల్లో బ్రంచ్‌లు, కాఫీ షాపుల్లో సైడ్ ప్రాజెక్టులు, కొత్త నైపుణ్యాల కోసం రాత్రిపూట ఆన్‌లైన్ కోర్సులు ఉంటాయని భావించాను. కానీ వాస్తవికత భిన్నంగా ఉంది” అని గౌరవ్ తన పోస్టులో రాసుకొచ్చారు.

వాస్తవికత ఎదుర్కొనడంలో ధైర్యం

అయితే గౌరవ్, తన అనుభవాన్ని గత ఏడాది కాలంలో వారానికి 50 నుంచి 60 గంటలు పనిచేశానని, చాలా రోజులు ఉదయం 3 గంటలకే నిద్రలేచి విధులకు హాజరయ్యానని ఆయన తెలిపారు. “దాదాపు 95 శాతం వారాంతాలు ఆఫీసులోనే గడిపాను. అరుదుగా సెలవు దొరికితే బయటకు వెళ్లి ఎంజాయ్ చేసేంత ఓపిక ఉండేది కాదు” అని ఆయన పేర్కొన్నారు. వరుసగా ఆరు రోజులు పనిచేసి అలసిపోయి, వేల మైళ్ల దూరంలో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి మాత్రమే సమయం దొరికేదని వాపోయారు. “కొత్త నగరంలో కొత్త స్నేహితులను చేసుకోవడం నేను ఊహించినంత సులభం కాదు. నా జీవితం కాలేజీలోనే ఆగిపోయిందా అని కూడా అనిపించింది. నిజం చెప్పాలంటే, ఆగలేదు. కానీ కాలేజీ నుంచి వాస్తవ ప్రపంచంలోకి మానసికంగా మారడం నేను ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉంది” అని ఆయన వివరించారు.

ఫిర్యాదు చేయడానికి కాదని, సర్దుకుపోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పడానికేనని గౌరవ్ స్పష్టం చేశారు. “మీరు కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత మొదటి సంవత్సరంలో ఉండి, సర్దుకుపోవడానికి కష్టపడుతుంటే.. మీరు ఒక్కరు మాత్రమే ఇలా ఇబ్బందిపడుతున్నారని అనుకోవద్దు. మీలాగే చాలామంది ఇవే సవాళ్లను ఎదుర్కొంటున్నారు” అని గౌరవ్ తన పోస్టులో ధైర్యం చెప్పారు.

Read also: Pakistan: ట్రంప్‌కు పాకిస్థాన్​ నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదన

#GauravChintamanidi #ImmigrantExperience #IndianInAmerica #LinkedInStory #USJobStruggles #WorkLifeBalance Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.