📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: G20 Summit 2025: సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
G20 Summit 2025: No country should use force to change borders.. G20 statement

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 (G20 Summit 2025) వార్షిక సదస్సులో సభ్య దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం లేదా బెదిరింపులను ఉపయోగించకూడదని ఒక ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. ఇది సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ప్రపంచ నిబద్ధతను స్పష్టంగా పునరుద్ఘాటిస్తుంది.

Read Also: Medina Accident: బస్సు దుర్ఘటన: తెలంగాణ ప్రభుత్వ హృదయాన్ని తాకిన స్పందన

ఈ ప్రతిపాదనకు అమెరికా అభ్యంతరాలను తెలిపింది. అయినప్పటికీ మిగా జీ20 దేశాలు దీనిని సంపూర్తిగా అంగీకరించాయి. ఈ ఉమ్మడి ప్రకటన లో ఉగ్రవాదం దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఖండించారు. అలాగే జాతి, లింగం, భాష, మతాలతో సంబంధం లేకుండా మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ట విస్తృత గౌరవాన్ని ఆశించారు. ఈ ప్రకటన ప్రపంచంలో తీవ్రతరం అవుతున్న భౌగోళిక, రాజకీయ చీలికలు, సాయుధ పోరాటాలు, ఆర్థిక విచ్ఛిన్నంపై ఆందోళనను ప్రతిబింబిస్తుంది.

దాంతో పాటూ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా రాజకీయ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ప్రాదేశిక సముపార్జనను కోరుకునే ఏ దేశం అయినా బెదిరింపు లేదా బలప్రయోగం నుండి ప్రపంచ దేశాలు దూరంగా ఉండాలని నొక్కి చెబుతోంది. దౌత్యవేత్తలు దీనిని రష్యా, ఇజ్రాయెల్ మరియు మయన్మార్‌లకు ఒక అవ్యక్త సంకేతంగా అర్థం చేసుకున్నారు.

G20 మానవతా చట్టాల సూత్రాలకు కట్టుబడి ఉంది

ప్రపంచ అస్థిరత, పెరుగుతున్న భౌగోళిక-ఆర్థిక పోటీ, విస్తరిస్తున్న అసమానతలు సమ్మిళిత వృద్ధికి ముప్పు కలిగిస్తున్నాయని డిక్లరేషన్ పేర్కొంది. దాంతో పాటూ అంతర్జాతీయ చట్టానికి,వివాదాల శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తూ.. G20 ఐక్యరాజ్యసమితి చార్టర్ ,అంతర్జాతీయ మానవతా చట్టాల సూత్రాలకు కట్టుబడి ఉందని తెలిపింది.

అలాగే విపత్తుల వల్ల దెబ్బ తిన్న చిన్న ద్వీప దేశాలూ, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు మద్దుతు ఇవ్వాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. ఆహార భద్రతపై, ప్రతి వ్యక్తికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కు ఉందని G20 (G20 Summit 2025) పునరుద్ఘాటించింది. వీటన్నిటితో పాటూ డిజిటల్ ,కృత్రిమ మేధస్సుతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు అందించే అవకాశాన్ని నాయకులు గుర్తించారు.

ఈ సాధనాలను ప్రజా శ్రేయస్సు కోసం సమానమైన రీతిలో ఉపయోగించుకోవాలని అన్నారు. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల మంత్రి రోనాల్డ్ లామోలా ఈ ప్రకటనను ఆమోదించడాన్ని “ఒక గొప్ప క్షణం” అని అభివర్ణించారు.ఇది ఆఫ్రికన్ ఖండానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

G20 Summit global borders declaration Johannesburg meeting latest news sovereignty protection Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.