అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం దక్షిణాఫ్రికా-అమెరికా సంబంధాలపై నీలినీడలు కమ్మేసింది. వచ్చే సంవత్సరం అమెరికా అధ్యక్షతన జరగబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను ఆహ్వానించబోమని ట్రంప్ ప్రకటించడంతో, జోహన్నెస్ బర్గ్ లో అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Intent to Leave: ‘డిగ్నిటీ యాక్ట్-2025’ కొత్త చట్టం .. భారతీయులకు ఊరట
ఆ నిర్ణయం విచారకరమని పేర్కొన్నారు. రెండు దేశాలమధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి తమవైపు నుంచి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని సిరిల్ రమఫోసా గుర్తు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ పక్కన పెట్టేసినట్లు ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
శ్వేతవర్ణ రైతులపై హింసపై ట్రంప్ ఆగ్రహం
దక్షిణాఫ్రికాలో శ్వేతవర్ణ రైతులపై హింస పెరుగుతోందని, వారికి జనసంహారం జరుగుతోందని ట్రంప్ వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలకు అక్కడి ప్రభుత్వం, కీలక శ్వేతవర్ణ నాయకులు కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అమెరికా ఈ సమావేశానికి హాజరుకావడం పూర్తిగా తమ నిర్ణయమని, దక్షిణాఫ్రికా ఎలాంటి అవగాహన లోపం సృష్టించలేదని తెలిపింది. దక్షిణాఫ్రికా గత చాలాకాలంగా జీ20లో కీలక సభ్యదేశంగా ఉన్నదనీ, ఆ వేదికలో అందరూ సమాన హక్కులతో పాల్గొనాలనే ధోరణిలో ఎప్పుడూ పనిచేసిందని ఆయన గుర్తు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: