📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాకిస్థాన్‌కు ఆగిపోయిన నిధులు, టర్కీతో విభేదాలు

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌(Pakistan)కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్(shahbaz sharif) టర్కీ అధ్యక్షుడు(Turkey President, Erdogan) ఎర్డోగన్‌కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది. ఇందులో పాక్‌ ఆర్థిక వ్యవస్థ దుస్థితి గురించి ఆయన వివరించారు. నావికాదళ యుద్ధనౌక ప్రాజెక్టు MILGEM నిధుల లేక ఆగిపోయిందని తెలిపారు. అలాగే MILDEN జలాంతర్గామి ప్రాజెక్టు కూడా నిలిచిపోయిందని చెప్పారు. అలాగే బకాయి చెల్లింపును 23 ఏళ్లు వాయిదా వేయాలని టర్కీని అభ్యర్థించారు. పాక్‌లో అలా అర్ధాంతరంగా ప్రాజెక్టులు నిలిచిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Pakistan: పాకిస్థాన్‌కు ఆగిపోయిన నిధులు, టర్కీతో విభేదాలు

పాక్‌లో టర్కీ ఫ్యాక్టరీ కొనసాగేనా?
గత కొన్నేళ్లుగా పాకిస్థాన్, టర్కీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. పాక్‌ వైమానిక దళంతో కలిసి ఆ దేశంలో ఓ పెద్ద ఆయుధ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు టర్కీ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా నివేదికలో వెల్లడైంది. ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోయే స్థలం గ్రౌండ్ సర్వే పూర్తయ్యింది. అలాగే ‘ప్రాజెక్ట్ ఇక్బాల్’ అనే కోడ్ పేరుతో పాకిస్తాన్ కోసం హై ఆప్టికల్ శాటిలైట్ కెమెరాను టర్కీ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు క్లిష్టమైన డిజైన్ సమీక్ష దశకు కూడా చేరుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల ఇది పెండింగ్‌లో ఉంది. టర్కీకి చెందిన BAYKAR ఆయుధ తయారీ సంస్థలో ప్రాణాంతకమైన TB1, TB2 డ్రోన్లు ఉన్నాయి. పాక్‌ కూడా ఈ డ్రోన్లను టర్కీ నుంచి కొనుగోలు చేసింది. పాక్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలో వాళ్ల ఉత్పత్తులు డిజైన్ చేయనున్నారు.

ఇంజినీరింగ్ ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలను తయారు

అలాగే అన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలను తయారు చేయనున్నారు. టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసిన తర్వాత పాకిస్తాన్ తమ వైమానిక దళ అధికారులకు టర్కీలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. TB-2 డ్రోన్‌ను ఆపరేట్ చేయడానికి మొదటి బ్యాచ్‌లో 6 మంది పాకిస్తాన్ వైమానిక దళ అధికారులకు శిక్షణ ఇచ్చారు. అలాగే మరో 12 మంది పాకిస్తాన్ వైమానిక దళ అధికారులకు అకిన్సి డ్రోన్‌ను ఆపరేట్ చేసే ట్రైనింగ్ అందించారు. అకిన్సి అనేది టర్కీకి చెందిన కొత్త సాయుధ డ్రోన్. ఈ డ్రోన్‌ను విక్రయించిన మొదటి దేశం పాకిస్తానే. రిపోర్టు ప్రకారం.. 2023లో పాకిస్తాన్‌కు 6-7 డ్రోన్లు డెలివరీ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rajiv Shukla: కోహ్లీ, రోహిత్‌ రిటైర్మెంట్ పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?

#telugu News Bilateral Tensions Geopolitical News International Disputes Pakistan Economy Pakistan Funding Crisis Turkey Diplomacy Turkey Pakistan Relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.