Work from home : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై పడుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని కొన్ని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు రావడంతో ఇంధన కొరతపై చర్చ మరింత పెరిగింది.
వర్క్ ఫ్రం హోం ప్రతిపాదన
ఈ నేపథ్యంలో వెల్స్ ఫార్గో ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. దేశంలో LPG కొరత నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం (WFH) ఇవ్వాలని ఆయన సూచించారు.
ప్రతిరోజూ లక్షలాది మంది ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు వాహనాలు ఉపయోగిస్తున్నారని, వీరికి ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇస్తే ఇంధనం ఆదా అవుతుందని చెప్పారు.
Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు
అత్యవసర రంగాలకు ఉపయోగం
ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తే చమురు వినియోగం తగ్గుతుందని, దాంతో ఆస్పత్రులు, లాజిస్టిక్స్, ప్రజా రవాణా వంటి అత్యవసర రంగాలకు ఇంధనం ఎక్కువగా అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సామాజిక బాధ్యతగా కంపెనీలు ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు.
సోషల్ మీడియాలో చర్చ
చంద్రశేఖర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొందరు మాత్రం దేశంలో ఇంధన కొరత అంత తీవ్రంగా లేదని, దీనిపై సోషల్ మీడియాలో మాత్రమే హైప్ క్రియేట్ అవుతోందని అంటున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. LPG ఉత్పత్తిని 10 శాతం వరకు పెంచినట్లు వెల్లడించింది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :