📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: PM Modi: రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ-వీసా… మోదీ

Author Icon By Vanipushpa
Updated: December 5, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, రష్యా మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Read Also: Simone Tata: లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

PM Modi

ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన ఆప్యాయత

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో ప్రజల మధ్య సంబంధాలకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ అన్నారు. “దశాబ్దాలుగా ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన ఆప్యాయత, గౌరవం, అభిమానం ఉన్నాయి. ఈ బంధాలను మరింతగా పటిష్టం చేయడానికి పలు కొత్త చర్యలు తీసుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ సంబంధాలను మరింత సులభతరం చేసేందుకు ఇటీవల రష్యాలో రెండు కొత్త భారత కాన్సులేట్లను (యెకాటెరిన్‌బర్గ్, కజాన్‌) ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

ఇరు దేశాలకు కొత్త బలాన్ని, అవకాశాలు

అలాగే మానవ వనరుల మార్పిడికి సంబంధించి రెండు ఒప్పందాలు కుదిరినట్లు ప్రధాని తెలిపారు. “మానవ వనరుల మార్పిడి మన ప్రజలను కలపడమే కాకుండా, ఇరు దేశాలకు కొత్త బలాన్ని, అవకాశాలను సృష్టిస్తుంది. వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ వంటి అంశాలలో కలిసి పనిచేస్తాం. విద్యార్థులు, మేధావులు, క్రీడాకారుల మధ్య పరస్పర పర్యటనలను కూడా పెంచుతాం” అని మోదీ వివరించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

bilateral diplomacy Breaking News in Telugu free e-visa announcement Google News in Telugu Latest In telugu news PM Modi Russia India relations Russian tourists e-visa Telugu News Today tourism policy India visa reforms

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.