📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : France PM – ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని సెబాస్టియన్‌ రాజీనామా

Author Icon By Sudha
Updated: October 6, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాన్స్‌లో మ‌ళ్లీ రాజ‌కీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్‌ నూతన ప్రధాని (France PM) సెబాస్టియన్‌ లెకోర్నూ తాజాగా రాజీనామా చేశారు. పదవి చేపట్టిన నెల రోజుల్లోనే అధికారం నుంచి ఆయన దిగిపోయారు. గత నెల జాతీయ అసెంబ్లీలో జ‌రిగిన విశ్వాస ప‌రీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఓడిపోవడంతో.. సెబాస్టియన్‌ను తదుపరి ప్రధానిగా అధ్యక్షుడు (France PM) ఎమ్మాన్యువ‌ల్ మాక్రన్ నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెబాస్టియన్‌ (France PM) ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజకీయ పార్టీలతో వారాల తరబడి సంప్రదింపులు జరిపిన అనంతరం ఆదివారం తన మంత్రివర్గాన్ని కూడా నియమించారు. నేడు మంత్రివర్గం తొలి సమావేశం కూడా నిర్వహించనుంది. మంత్రివర్గాన్ని నియమించిన గంటల వ్యవధిలోనే ప్రధాని సెబాస్టియన్‌ రాజీనామా (resignation)చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయన రాజీనామాను అధ్యక్షుడు మాక్రన్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.

France PM – ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని సెబాస్టియన్‌ రాజీనామా

కాగా, గ‌త రెండేళ్లలో ఫ్రాన్స్‌లో రెండుసార్లు తాత్కాలిక ప్రభుత్వం న‌డిచింది. ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ప్రధాని విష‌యంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రధాని నియామ‌కం మాక్రన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆయ‌న వ‌ద్ద రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్త ప్రధానిని నియ‌మించ‌డం లేదా జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వహించ‌డ‌మే. గత రెండేళ్ల నుంచి ఇదే సమస్య వస్తున్నా.. ఎన్నిక‌లు నిర్వహించేందుకు మాత్రం దేశాధ్యక్షుడు మొగ్గు చూప‌లేదు. ఒక‌వేళ ఈసారి ఎన్నిక‌ల‌కు వెళ్తే, ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మ‌ధ్య ఎన్నిక‌లు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియ‌మిస్తారు.

దేనిని ఫ్రెంచ్ డిఫెన్స్ అని ఎందుకు పిలుస్తారు?

ఫ్రెంచ్ డిఫెన్స్ అనేది చదరంగంలో అత్యంత పురాతనమైన ఓపెనింగ్‌లలో ఒకటి. ఈ ఓపెనింగ్ పేరు 1834లో లండన్ చెస్ క్లబ్ మరియు పారిస్ చెస్ క్లబ్ మధ్య జరిగిన కరస్పాండెన్స్ గేమ్ నుండి వచ్చింది. 1.e4కి బ్లాక్ యొక్క ప్రాథమిక ప్రతిస్పందనగా ఇది ఇతర ఓపెనింగ్‌లను ఎప్పుడూ అధిగమించనప్పటికీ, ఫ్రెంచ్ డిఫెన్స్ ఎల్లప్పుడూ అగ్ర ఆటలలో ఉంది.

అత్యుత్తమ సైనిక శక్తి కలిగిన దేశం ఏది?

యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా కొనసాగుతోంది, గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్‌లో స్థిరంగా మొదటి స్థానంలో ఉంది. దాని సాటిలేని రక్షణ బడ్జెట్, అధునాతన సాంకేతికత మరియు ప్రపంచ ఉనికి యుద్ధానికి సంబంధించిన అన్ని డొమైన్‌లలో దాని ఆధిపత్యాన్ని నిర్ధారిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News france latest news Political Crisis prime minister resignation Sebastien Lecornu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.