రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఫ్రాన్స్ (France)లో తాజాగా నిరసనలు (Protest) చెలరేగాయి. ఫ్రాన్స్ (France) ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో పెద్ద ఎత్తున వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆర్థిక, రాజకీయ సంక్షోభం, సమాజంలో నెలకొన్న అశాంతి కారణంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ నగరమైన రెన్నెస్‌లో నిరసనకారులు ఓ బస్సును తగలబెట్టారు. రంగంలోకి దిగిన అధికారులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటి వరకూ దాదాపు 200 మందిని అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రి బ్రూనో రిటైల్లూ ప్రకటించారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మరోవైపు ఫ్రాన్స్ (France)నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్నూ నియమితులైన విషయం తెలిసిందే. విశ్వాసపరీక్షలో ప్రధాని బేరో ఓటమిపాలవటంతో రక్షణమంత్రిని కొత్త ప్రధానిగా ఎంపికచేశారు. ఏడాది వ్యవధిలో ఫ్రాన్స్‌లో ప్రధానిగా బాధ్యత చేపట్టిన నాలుగో వ్యక్తిగా లెకోర్నూ నిలిచారు. అంతకుముందు బేరో ప్రతిపాదించిన విశ్వాస పరీక్షలో ఆయనకు వ్యతిరేకంగా 364 ఓట్లు, అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. దీంతో రాజకీయ సంక్షోభం ముదరడంతో దేశాధ్యక్షుడు మాక్రాన్ రెండేండ్లలోపే అయిదో ప్రధానిని వెతకాల్సిన అవసరం ఏర్పడింది.
2025 లో ఫ్రాన్స్ ఎందుకు నిరసన వ్యక్తం చేసింది?
2025 ఫ్రెంచ్ తీవ్రవాద నిరసనలు నేషనల్ ర్యాలీ మరియు సానుభూతిపరులైన సంస్థలు నిర్వహించే రాజకీయ ప్రదర్శనలు, నేషనల్ ఫ్రంట్ అసిస్టెంట్ల వ్యవహారంలో మెరైన్ లె పెన్‌ను దోషిగా నిర్ధారించడాన్ని నిరసిస్తూ ఆమె 2030 వరకు పదవికి పోటీ చేయడానికి అనర్హురాలిగా తీర్పు ఇవ్వబడింది.
ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు?
జూన్ 6, 2025న, యునైటెడ్ స్టేట్స్‌కు అక్రమ వలసలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వ్యక్తులను అరెస్టు చేయడానికి ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు అనేక నగర ప్రదేశాలపై దాడి చేసిన తర్వాత లాస్ ఏంజిల్స్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి.
అమెరికాలో నిరసనలకు అనుమతి ఉందా?
వీధుల్లో లేదా కాలిబాటలపై కవాతు చేయడానికి మీకు అనుమతి అవసరం లేదు, నిరసనకారులు కారు లేదా పాదచారుల రాకపోకలకు ఆటంకం కలిగించనంత వరకు. మీకు అనుమతి లేకపోతే, పోలీసు అధికారులు ఇతరులను దాటడానికి లేదా భద్రతా కారణాల దృష్ట్యా వీధి లేదా కాలిబాట వైపుకు వెళ్లమని మిమ్మల్ని అడగవచ్చు. కొన్ని రకాల కార్యక్రమాలకు అనుమతులు అవసరం కావచ్చు
Read hindi news: hindi.vaartha.com
Read Also: