📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Sridhar Vembu: ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

Author Icon By Vanipushpa
Updated: January 14, 2026 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జోహో అధినేత శ్రీధర్ వేంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న విడాకుల పోరాటం కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రమీల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును 1.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,000 కోట్లు) విలువైన బాండ్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల తర్వాత నాలుగో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది. 1993లో శ్రీధర్ వేంబు(Sridhar Vembu), ప్రమీలా శ్రీనివాసన్ వివాహం జరిగింది. దాదాపు 25 ఏళ్ల పాటు అమెరికాలో కలిసి ఉన్న ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే 2020లో ప్రమీల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read Also: Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

Sridhar Vembu: ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

భర్తపై భార్య సంచలన ఆరోపణలు

ఈ క్రమంలో ఆమె తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న తమ కుమారుడిని, తనను అమెరికాలోనే వదిలేసి శ్రీధర్ వేంబు శాశ్వతంగా భారత్‌కు వెళ్లిపోయారని ఆమె వాపోయారు. అలాగే కాలిఫోర్నియాలోని ఉమ్మడి ఆస్తి చట్టాల నుంచి తప్పించుకోవడానికి శ్రీధర్ వేంబు జోహో కంపెనీ షేర్లను, మేధో సంపత్తిని తన తోబుట్టువుల పేరిట రహస్యంగా బదిలీ చేశారని ఆరోపించారు. అది మాత్రమే కాకుండా పెళ్లయినప్పటి నుంచి కంపెనీ తనదేనని చెప్పిన శ్రీధర్.. విడాకుల సమయానికి తన వాటా కేవలం 5 శాతమేనని, మిగిలిన 80 శాతానికి పైగా వాటా తన సోదరి రాధా వేంబు, సోదరుడు శేఖర్ వేంబులకు ఉందని కోర్టులో చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రమీల పేర్కొన్నారు. అయితే శ్రీధర్ వేంబు ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. తాను గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకే భారత్‌కు వచ్చానని.. తన భార్యా పిల్లలను కూడా రమ్మని కోరానని ఆయన వివరణ ఇచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

billionaire divorce corporate leaders fourth costliest divorce global business news Latest News in Telugu most expensive divorces Telugu News online Telugu News Today Zoho CEO divorce

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.