📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Jaipur: సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం కోసం నలుగురు మృతి

Author Icon By Shobha Rani
Updated: May 28, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డబ్బులు ఎక్కువగా వస్తాయనే ఆశతో సెప్టిక్‌ ట్యాంక్‌(Septic Tank)లోకి దిగిన నలుగురు కూలీలు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌(Jaipur)లో చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌(Septic Tank)లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మరణించారు.. అయితే, తొలుత ఆ పని చేయడానికి వారు నిరాకరించారని తెలిసింది. కానీ, కూలీ డబ్బులు అదనంగా ఎక్కువ ఇస్తామని గోల్డ్ షాపు యజమాని చెప్పడంతో ఆశతో కూలీలు ఈ పనికి ఒప్పుకున్నారని తెలిసింది. కానీ, చివరకు వారంతా అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. జరిగిన సంఘటనలో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేపింది. ట్యాంక్‌లో సల్ఫర్ హైడ్రోజన్ వంటి విషపూరిత వాయువులు ఉండే అవకాశం ఉంది. వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి, ఊపిరాడకుండా కార్మికులు స్పృహ కోల్పోయారు. అంతర్గత భద్రతా ప్రమాణాలు లేకుండా పనిచేయడం కార్మికుల మృతికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

Jaipur: సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం కోసం నలుగురు మృతి

శ్వాస ఆడనివ్వని సెప్టిక్ ట్యాంక్
సీతాపుర పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలోని 10 అడుగుల సెప్టిక్ ట్యాంక్‌లోకి ముందుగా అమిత్, రోహిత్ సెప్టిక్ దిగారు. నిమిషాల్లోనే వారు స్పృహ కోల్పోవడం మొదలుపెట్టి సహాయం కోసం కేకలు వేశారు. వారిని కాపాడటానికి తోటి కార్మికులు సంజీవ్, హిమాన్షు, అర్పిత్, అజయ్, రాజ్ పాల్, ముఖేష్ ట్యాంక్ లోకి దిగారు. అయితే ఊపిరాడక వారంతా స్పృహ కోల్పోయారు. కార్మికులు 10 అడుగుల లోతు గల సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగగానే విషపూరిత పొగలు వ్యాపించాయని తెలిసింది. దాంతో కార్మికులంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్మికులను ట్యాంక్ నుండి బయటకు తీసి మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ నిష్క్రియాశీలతను విమర్శించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం, ఉద్యోగ భరోసా అవసరం. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలి నెలల్లో బికనీర్, డీగ్, జైపూర్ (Jaipur) అంతటా సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తున్న క్రమంలో దాదాపు పది మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని గెహ్లాట్ కోరారు.

Read Also: Trump: 51వ రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్ డోమ్ ఫ్రీ: ట్రంప్

Breaking News in Telugu Four died for gold Google news Google News in Telugu in septic tank Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.