📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US: అసీం మునీర్​ పై నిప్పులు చెరిగిన పెంటగాన్‌ మాజీ అధికారి

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) పర్యటనలో ఉండగానే అణు బెరింపులకు పాల్పపడిన పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్(Asif Munir)​ను పెంటగాన్ మాజీ అధికారి తీవ్రంగా విమర్శించారు. మునీర్ సూట్​లో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా మాజీ చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అని మైఖెల్‌ రూబిన్(Michael Rubin) అన్నారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాకిస్థాన్​ చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కోల్పోయిందని మండిపడ్డారు.
ఒసామా బిన్​ లాడెన్ ప్రకటనలను తలపిస్తున్న
‘అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీచీఫ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ బెదిరింపు నేపథ్యంలో పాకిస్థాన్ ఒక దేశంగా తమ బాధ్యతలను నిర్వర్తించగలదా అనే ప్రశ్న చాలా మంది మనసులో లేవనెత్తుతోంది. మునీర్ వ్యాఖ్యలు గతంలో ఐసిస్, ఒసామా బిన్​ లాడెన్ చేసిన ప్రకటనలకు తలపిస్తున్నాయి. ఆయన మాటాలను ట్రంప్ సర్కార్ వెంటనే ఖండించాలి. దేశం నుంచి బహిష్కరించాల్సి ఉంది. పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పాకిస్థాన్​ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాంగా గుర్తించాలి’ అని రూబిన్ అన్నారు.

US: అసీం మునీర్​ పై నిప్పులు చెరిగిన పెంటగాన్‌ మాజీ అధికారి

నోబెల్‌ శాంతి బహుమతిపై మనసున్న ట్రంప్‌
ఇటీవల భారత్​ దిగుమతులపై అమెరికా విధించిన సుంకాల గురించి రూబెన్ మాట్లాడారు. భారత ప్రధాని మోదీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ న్యూదిల్లీని లక్ష్యంగా చేసుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రస్తుత పరిపాలనా విధానం మారిన తర్వాత భారత్‌- యూఎస్ సంబంధాలు గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఒక వ్యాపారవేత్త అని, ఆయన చేసే చెడు శాంతిఒప్పందం యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుందనే విషయం ఆయనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకోవాలని ఆశయంతో ఆయన ఉన్నారని తెలిపారు.
భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న మునీర్‌
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మునీర్‌, భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, ఒకవేళ భవిష్యత్తులో భారత్​ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భయపడేది లేదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది.

భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది?

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ నాలుగు యుద్ధాలు చేశాయి, 1947, 1965, 1971, మరియు 1999. మూడు యుద్ధాలు (1947, 1965, మరియు 1999) కాశ్మీర్ కోసం జరిగాయి.

భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏమిటి?

భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంక్లిష్టమైన మరియు ఎక్కువగా శత్రు సంబంధం ఉంది, ఇది అనేక చారిత్రక మరియు రాజకీయ సంఘటనలలో, ముఖ్యంగా ఆగస్టు 1947లో బ్రిటిష్ ఇండియా విభజనలో పాతుకుపోయింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/bilawal-bhutto-war-threats-against-india/international/529342/

Asim Munir Defence News former US official International Relations Pakistan army Pentagon Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.