📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Suresh Rathore : నటిని పెళ్లాడి చిక్కుల్లో పడిన మాజీ ఎమ్మెల్యే

Author Icon By Shobha Rani
Updated: June 24, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ (Suresh Rathore)తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. లేటు వయసులో ఘాటు ప్రేమతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఓ నటితో రెండో వివాహం.. రీల్స్‌ కారణంగా ఆయనపై పార్టీ సీరియస్ అయింది. సహరన్‌పూర్ నటి ఊర్మిళ సనావర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌. భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారు సురేష్ రాథోడ్(Suresh Rathore). ఇష్టారీతిన రీల్స్‌ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.

బీజేపీ పార్టీ స్పందన

సనావర్‌కు మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సురేష్ రాథోడ్ (Suresh Rathore) జంటతో పాటు పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సురేష్ రాథోడ్‌కు పార్టీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యంపై 7 రోజుల్లో స్పందించాలని ఆదేశించింది.

ఒకేసారి ఇద్దరితో పెళ్లి చెల్లదు

ఉత్తరాఖండ్‌లో అమలులో ఉన్న యూనిఫాం సివిల్ కోడ్ ప్రకారం.. బహుభార్యత్వం చెల్లదు. కానీ తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటిని పెళ్లిచేసుకోవడం వివాదాస్పంగా మారింది. విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో.. పార్టీ స్పందించింది. అయితే నటి సనావర్‌ను 2021లోనే నేపాల్‌లో పెళ్లిచేసుకున్నట్టు సురేష్ రాథోడ్ (Suresh Rathore)చెప్తున్నారు. అప్పటికి యూనిఫాం సివిల్ కోడ్ అమలులో లేదంటున్నారాయన.

Suresh Rathore : నటిని పెళ్లాడి చిక్కుల్లో పడిన మాజీ ఎమ్మెల్యే

ఎవరు ఈ సురేష్ రాథోడ్?

2017 నుంచి 2022 వరకు హరిద్వార్‌లోని జ్వాలాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యేగా సురేష్ రాథోడ్ (Suresh Rathore)కొనసాగారు. 2022 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నటితో సహజీవనం చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం.. మీడియా ముందు ప్రపోజ్ చేసుకోవడంతో చిక్కుల్లో పడ్డారు సురేష్ రాథోడ్.

సోషల్ మీడియాలో సెన్సేషన్

వైరల్ వీడియోలు ప్రేమ కన్ఫెషన్, పెళ్లి క్లిప్స్, డ్యాన్స్ రీల్స్. సురేష్ రాథోడ్ (Suresh Rathore) ఆన్‌లైన్ యాక్టివిటీ: నిత్యం reels షేర్ చేస్తూ ప్రముఖుడిగా మారారు. ప్రజల స్పందన: మిశ్రమం – కొందరు విమర్శలు, మరికొందరు కామెడీగా తీసుకుంటున్నారు.

Read Also: Pahalgam: మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తున్న పహల్గామ్

BJPControversy Breaking News in Telugu Former MLA gets into trouble for Google news Google News in Telugu Latest News in Telugu marrying an actress Paper Telugu News SecondMarriageDrama SureshRathore Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news UCCViolation ViralProposal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.