📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Tomiichi Murayama: 101 ఏళ్ల జ‌పాన్ మాజీ ప్ర‌ధాని క‌న్నుమూత‌

Author Icon By Sudha
Updated: October 17, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జ‌పాన్ సోష‌లిస్టు పార్టీ నేత‌, మాజీ ప్ర‌ధాని తొమిచి ముర‌య‌మ(Tomiichi Murayama) ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 101 ఏళ్లు. ఓయిటా సిటీలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 1924 మార్చి 3వ తేదీన ఆయ‌న ఓయిటా జిల్లాలో జ‌న్మించారు. 1938లో ఆయ‌న టోక్యోకు వ‌ల‌స వెళ్లారు. ఆ త‌ర్వాత సైనిక ద‌ళాల్లో చేరారు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో కుమ‌మోటో వ‌ద్ద విధులు నిర్వ‌ర్తించారు. 1972లో ఆయ‌న తొలిసారి దిగువ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. జ‌పాన్ సోష‌లిస్టు పార్టీకి ఆయ‌న 1993లో చైర్మ‌న్ అయ్యారు. 1994, జూన్ 29వ తేదీన జ‌పాన్ 81వ ప్ర‌ధానిగా తొమిచి ముర‌య‌మ(Tomiichi Murayama)మురియ‌మ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Read Also: Trump: హమాస్ రక్తపాతంపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

Tomiichi Murayama: 101 ఏళ్ల జ‌పాన్ మాజీ ప్ర‌ధాని క‌న్నుమూత‌

రెండో ప్ర‌పంచ యుద్ధానికి 50 ఏళ్లు ముగిసిన సంద‌ర్భంగా 1995లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో యుర‌య‌మ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. త‌ప్పుడు జాతీయ విధానం వ‌ల్ల జ‌పాన్ యుద్ధ కాంక్ష‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు చెప్పారు. దీంతో జ‌పాన్ ప్ర‌జ‌లు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన‌ట్లు చెప్పారు. త‌మ వ‌ల్ల అనేక దేశాల ప్ర‌జ‌లు, ముఖ్యంగా ఆసియా దేశాల్లో డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రిగింద‌న్నారు. 2000 సంవ‌త్స‌రంలో ఆయ‌న రాజ‌కీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.

తోమిచి మురయామా ప్రారంభ జీవితం మరియు విద్య?

ఓయిటా ప్రిఫెక్చర్‌లో జన్మించిన మురాయామా 1946లో మీజీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు మరియు తన స్వస్థలమైన ప్రిఫెక్చర్‌లో కార్మిక సంఘం అధికారి అయ్యాడు. అతను 1955లో జపాన్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా ఓయిటా సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు; ఆ తర్వాత 1963లో ఓయిటా ప్రిఫెక్చురల్ అసెంబ్లీకి మరియు 1972లో నేషనల్ డైట్‌కు ఎన్నికయ్యాడు.

తోమిచి మురయామా రాజకీయ జీవితం?

టోమిచి మురయామా 1994 నుండి 1996 వరకు జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక జపనీస్ రాజకీయ నాయకుడు. 1948లో టెట్సు కటయామా తర్వాత ఆయన దేశానికి మొట్టమొదటి సోషలిస్ట్ ప్రధానమంత్రి , మరియు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 50వ వార్షికోత్సవం సందర్భంగా మురయామా ప్రకటన ద్వారా ఆయనను బాగా గుర్తుండిపోతారు , దీనిలో ఆయన జపాన్ గత వలస యుద్ధాలు మరియు దురాక్రమణకు అధికారికంగా క్షమాపణలు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Former Prime Minister japan Japanese Politics latest news Obituary Telugu News Tomiichi Murayama

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.