📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest News: Former CJ Sushila Karki – నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ సీజే సుశీల కర్కీ

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 8:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజకీయ అస్థిరత, జాతీయ ఆందోళనలు నేపాల్‌ (Nepal) లో కొనసాగుతున్నాయి. తాజాగా, దేశంలో జన్ జీ ఆందోళనలతో పరిస్థితి తీవ్రంగా అల్లకల్లోంగా మారింది. ఈ నేపథ్యంలో, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అవసరం ఏర్పడింది. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కీ ఈ బాధ్యతను స్వీకరించనున్నారు.గత మూడు రోజులుగా కొనసాగుతోన్న ఆందోళనలు బుధవారం కాస్తా శాంతించాయి.

తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కి (Former judge Justice Sushila Karki) బాధ్యతలు చేపట్టనున్నారు.జస్టిస్ సుశీలా కర్కీ నాయకత్వాన్ని ఆందోళనకారులు అంగీకరించారు. దీంతో నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఆమె చర్యలు తీసుకోనున్నారు. జస్టిస్ సుశీల కర్కి.. నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ. 2016, ఫిబ్రవరిలో నేపాల్ సీజేఐగా ఆమె బాధ్యతలు చేపట్టారు.

Latest News

సీజే సుశీల కర్కీ నేపథ్యం

అవినీతి విషయంలో ఎలాంటి జాలి చూపించని, భయపడని న్యాయమూర్తి (Judge) గా జస్టిస్ కర్కికి గుర్తింపు ఉంది. మహిళలు తమ పిల్లలకు పౌరసత్వం ఇవ్వగలరని అనుమతించే తీర్పులను కూడా ఆమె ఇచ్చారు. గతంలో నేపాల్‌లో కేవలం పురుషులకే ఈ హక్కు ఉండేది. ‘సమర్థులైన మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉండాలి.. అప్పుడే మహిళా విమోచనం సాధ్యమవుతుంది’ అనేది ఆమె సిద్దాంతం. ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించిన కర్కీ.. తర్వాత సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు.

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత

రాజకీయ ప్రభావం లేదా వ్యక్తిగత సంబంధాలకు లోనుకుండా స్వతంత్రంగా తీర్పులు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు.సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఎంపిక చేసిన పోలీసు చీఫ్ నియామకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో పక్షపాతం చూపడం, కార్యనిర్వాహక విభాగ పరిధిలో జోక్యం చేసుకున్నారనే ఆరోపిస్తూ 2017 ఏప్రిల్‌లో జస్టిస్ సుశీలా కర్కిపై పాలక పక్షం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-india-win-the-toss-and-elect-to-bowl/international/544869/

Breaking News first female Chief Justice Jan JEE movement Justice Sushila Karki latest news Nepal interim government Nepal Protests Nepal Supreme Court political unrest in Nepal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.