దుబాయ్ ప్రభుత్వం ఉద్యోగుల (Dubai government employees) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక విశేషమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు పది రోజుల ‘వివాహ సెలవు’ని మంజూరు (Grant of ‘marriage leave’) చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇది 2025 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.ఈ సెలవు కాలంలో ఉద్యోగులకు పూర్తివేతనం చెల్లించనున్నారు. ఈ పథకం ద్వారా వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని, ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు.
2025 డిక్రీ నంబర్ (31) ద్వారా అమలు
ఈ కొత్త పథకం 2025 డిక్రీ నంబర్ 31 ప్రకారం అధికారికంగా ఆమోదించబడింది. ఇది యూఏఈ పౌరులకే వర్తిస్తుంది. దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయ శాఖ, సైనిక విభాగాలు (అభ్యర్థులు మినహా), ఫ్రీ జోన్లు, ప్రత్యేక అభివృద్ధి మండలాలు, డిఫ్‌సీ వంటి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.ఈ సెలవులు కేవలం వివాహ వేళ మాత్రమే కాకుండా ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ సంవత్సరం వాడుకోలేకపోతే, ప్రత్యేక అనుమతితో తదుపరి సంవత్సరానికి మార్చుకోవచ్చు.
ప్రొబేషన్ పూర్తయిన ఉద్యోగులకే వర్తింపు
ఈ సెలవు పథకం కేవలం ప్రొబేషనరీ కాలాన్ని పూర్తిచేసిన ఉద్యోగులకే వర్తిస్తుంది. పైగా, వారు యూఏఈలో గుర్తింపు పొందిన వివాహంతో సంబంధం ఉన్నప్పుడే ఈ సెలవు మంజూరు అవుతుంది.ఈ చర్య ద్వారా దుబాయ్ ప్రభుత్వం ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, కుటుంబ సంపర్కాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు తమ జీవితంలోని ముఖ్య సందర్భాలను శాంతిగా, సమర్ధంగా గడిపేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.
Read Also : Pahalgam Attack : టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా