📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Mexico: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: January 27, 2026 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్, నేర ముఠాల ఆధిపత్య పోరు మరోసారి రక్తపాతానికి దారితీసింది. ఆదివారం (జనవరి 25, 2026) సాయంత్రం సెంట్రల్ మెక్సికో(Mexico)లోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సండే వినోదంగా కోసం వచ్చిన పౌరులపై గన్‌మెన్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. సలమాంకా సిటీలోని లోమా డి ఫ్లోర్స్ ఏరియాలో ఒక కమ్యూనిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత ఈ ఘోరం జరిగింది. మ్యాచ్ ముగిసి అందరూ బయటకు వస్తున్న సమయంలో గన్స్‌తో వచ్చిన కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు.

Read Also: AP Weather: దట్టమైన పొగమంచు హెచ్చరిక.. ఉదయం వేళల్లో డేంజర్

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి

10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

దుండగులు వాహనాల్లో వచ్చి ఒక్కసారిగా గుంపుపై తూటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో ఒక మహిళ, ఓ బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అమానుష ఘటనపై సలమాంకా మేయర్ సీజర్ ప్రియెటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని “పిరికిపంద చర్య”గా అభివర్ణించిన ఆయన, స్థానిక అధికారులను లొంగదీసుకోవడానికి నేర ముఠాలు చేస్తున్న ప్రయత్నమని అన్నారు. గ్వానాజువాటో రాష్ట్రం ప్రస్తుతం సాంటా రోసా డి లిమా గ్యాంగ్, జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ మధ్య జరుగుతున్న భీకర పోరుకు నిలయంగా మారింది. చమురు దొంగతనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పట్టు కోసం ఈ ముఠాలు తరచూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దారుణ ఉదంతం తర్వాత మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ సహాయం కోరుతూ మేయర్ విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

11 people killed football match violence gun attack news international crime news Latest News in Telugu Public safety concerns Shooting Incident Sports Tragedy Stadium Violence Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.