ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతున్నాయి. ఒకవైపు భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం, క్లౌడ్ బరస్ట్, అధిక వర్షాలతో వరదలు, (Floods) సునామీ వంటివాటితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. తాజాగా థాయ్ లాండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
సౌత్ థాయ్ లాండ్ లో (Thailand) గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావానికి ఏకంగా 12 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యంతో థాయ్ లాండ్ చిగురుటాకులా ఒణికిపోతున్నది. ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి, తీవ్ర ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో శిధిలాలకింద ప్రజలు చిక్కుకున్నారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల్లో చాలామంది చిక్కుకు పోయారు. దీంతో వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని
అధికారులు చెబుతున్నారు. రవాణ పూర్తి స్తంభించిపోవడంతో ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకు సంబంధాలు కూడా తెగిపోయాయి. నదులు, చెరువులు వరద నీటితో నిండిపోయి, పలు ఇళ్ల వరదల్లో మునిగిపోయాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: