📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: Floods: భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం.. 442 మంది మృతి

Author Icon By Sushmitha
Updated: December 1, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇండోనేషియా జనజీవనం స్తంభించిపోయింది. అగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం (Floods) సృష్టించాయి. ఇండోనేషియా,(Indonesia) థాయ్లాండ్, మలేషియా,శ్రీలంక అతలాకుతలం అయ్యాయి. ఇక ఇండోనేషి యాపై భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాలతో సుమత్రా ద్వీపాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనికి తోడు వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. 

Read Also: Visa: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి శూన్యం..ఎలాన్ మస్క్

Floods Indonesia hit by heavy rains.. 442 people dead

ఆకస్మిక వరదలతో ఇప్పటివరకు 442 మంది చనిపోగా.. వందలాది మంది తప్పిపోయారు. ఇక లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఒకవైపు ఇళ్లు కోల్పోయి, ఆహారం, నిత్యావసర వస్తువుల కోసం పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలకు (Heavy rains) తోడు ఈదురుగాలులు, చలి తీవ్రత బాగా పెరిగింది. నిలువ నీడను కోల్పోయి, చలికి వణికిపోతున్న బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలకు దిగింది. జాతీయ విపత్తు కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

వణికిపోతున్న ద్వీప దేశాలు

అసాధారణమైన సెన్యార్, దిత్యా తుఫానులు ఆగ్నేయాసియా అంతటా విధ్వంసం సృష్టించాయి. థాయ్ లాండ్, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు హడలెత్తిపోయాయి. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దాదాపు 193 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక థాయ్ లాండ్ లో  145 మంది చనిపోయారు. ఇలా ఆగ్నేయాసియాలో తుపాన్లు కారణంగా జలప్రళయం బీభత్సం సృష్టించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

వేలాదిమంది గల్లంతయ్యారు. విపత్తు బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సేవలు భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ దెబ్బతిన్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం వందలాది మంది తప్పిపోయినట్లుగా కథనాలు వస్తున్నాయి. సెన్సార్ తుఫాను కారణంగా ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయని, వేలాది భవనాలు మినిగిపోయాయయి అధికారులు తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

climate change; death toll 442 Floods Google News in Telugu Heavy Rains Indonesia Latest News in Telugu Natural Disaster Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.