📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Flood Warning- తావీ నదిలో వరదల హెచ్చరిక: పాకిస్థాన్‌కు భారత్ అలర్ట్

Author Icon By Sudha
Updated: August 25, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా తావీ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఇది ఆగ్నేయ దిశలో పంజాబ్ మీదుగా పాకిస్థాన్‌లో ప్రవేశించే నదిగా గుర్తించబడింది.భారత్ పాకిస్థాన్‌ (Pakistan)కు అధికారికంగా వరద (Flood Warning) ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ సమాచారం ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వానికి అందజేయబడింది. తావీ న‌దిలో వ‌ర‌ద‌లు (Flood Warning) వ‌చ్చే ప్ర‌మాదం ఉన్న‌ట్లు పాకిస్థాన్‌కు ఇండియా వార్నింగ్ ఇచ్చింది. భార‌త్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు స్థానికుల‌కు వ‌ర‌ద వార్నింగ్ ఇచ్చారు.

Flood Warning- తావీ నదిలో వరదల హెచ్చరిక: పాకిస్థాన్‌కు భారత్ అలర్ట్

ప్ర‌స్తుతం పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఇండో, పాక్ మ‌ధ్య సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం నిలిపివేత‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తావీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో వ‌ర‌దలు (Flood Warning) వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు పాకిస్థాన్‌కు స‌మాచారం చేర‌వేసిన‌ట్లు ఓ క‌థ‌నం ద్వారా తెలిసింది. అయితే ఈ ప‌రిణామానికి చెందిన అధికారిక స‌మాచారం లేదు. సాధార‌ణంగా వ‌ర‌ద‌ల‌కు చెందిన వార్నింగ్‌.. సింధూ జ‌లాల క‌మీష‌న‌ర్ చూసుకుంటారు. మే నెల‌లో రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల త‌ర్వాత తొలిసారి ఇండియా, పాక్ కాంటాక్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో ఉన్న భార‌తీయ హై క‌మీష‌న్‌కు అల‌ర్ట్ అంశాన్ని చేర‌వేశారు. భార‌త్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు స్థానికుల‌కు వ‌ర‌ద వార్నింగ్ ఇచ్చారు.

వరదలు హెచ్చరిక సంకేతాలు ఏమిటి?

స్థానిక ప్రాంతంలో ఆకస్మిక వరదల సంకేతాల గురించి తెలుసుకోండి. వీటిలో భారీ వర్షపాతం, లోతట్టు ప్రాంతాలలో నీరు ఉప్పొంగడం లేదా నిలిచిపోవడం వంటివి ఉండవచ్చు.

వరదలు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయి?

వరదలు శారీరక గాయం, అనారోగ్యం మరియు ప్రాణనష్టానికి కారణమవుతాయి . లోతుగా, వేగంగా ప్రవహించే లేదా వేగంగా పెరుగుతున్న వరద నీరు ముఖ్యంగా ప్రమాదకరం. ఉదాహరణకు, సెకనుకు 2 మీటర్లు (మీ/సెకను) వేగంతో ప్రవహించే నిస్సారమైన నీరు కూడా పిల్లలను మరియు చాలా మంది పెద్దలను పడవేస్తుంది.

విపత్తు ముందస్తు హెచ్చరికలు ఏమిటి?

ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అనేవి తుఫానులు, వరదలు, కరువులు, వేడిగాలులు లేదా కార్చిచ్చులు వంటి రాబోయే ప్రమాదాల గురించి సకాలంలో మరియు చర్య తీసుకోదగిన హెచ్చరికలను అందించడానికి రూపొందించబడిన సమగ్ర వ్యవస్థలు . ఇది వ్యక్తులు మరియు సమాజాలు తమ ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు సంభావ్య ప్రభావాలకు సిద్ధం కావడానికి చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ukraine-drone-attack-on-russia-again/international/535499/

Breaking News Flood Warning India Alerts Pakistan India Pakistan Relations latest news Monsoon Floods Tawi River Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.