Flight Ticket:విమాన టికెట్ రద్దుపై డీజీసీఏ సూపర్ ఆఫర్ – ప్రయాణికులకు గుడ్ న్యూస్

Read Time:  1 min
Flight Ticket
Flight Ticket
FONT SIZE
GET APP

విమాన ప్రయాణికులకు డీజీసీఏ (Directorate General of Civil Aviation) శుభవార్త అందించింది. ఇకపై ఎవరైనా టికెట్ బుక్(Flight Ticket) చేసిన తర్వాత 48 గంటల్లోపు రద్దు చేయాలనుకున్నా లేదా ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకున్నా ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తుంది.

Read Also:  AP: హైకోర్టు లో సాక్షి కి షాక్.. పిటిషన్ల కొట్టివేత

Flight Ticket
Flight Ticket

క్రెడిట్ కార్డు ద్వారా టికెట్‌ బుక్‌ చేసిన ప్రయాణికులకు రిఫండ్‌ 7 రోజుల్లో అందుతుంది. ట్రావెల్ ఏజెంట్ లేదా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్నవారికి 21 పనిదినాల్లో రిఫండ్‌ జమ కానుంది. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు, ఎయిర్‌లైన్‌ కంపెనీల పారదర్శకతను పెంపొందించేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొన్నారు.

అయితే, దేశీయ విమానాల్లో(Flight Ticket) ప్రయాణానికి 5 రోజుల లోపు (5D), అంతర్జాతీయ విమానాల్లో 15 రోజుల లోపు (15D) బుకింగ్‌లకు ఈ ఉచిత రద్దు సౌకర్యం వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులు అనుకోని షెడ్యూల్‌ మార్పుల వల్ల ఇబ్బంది పడకుండా, తమ బుకింగ్‌లను సులభంగా సవరించుకోవచ్చు. విమానయాన రంగంలో వినియోగదారుల సౌకర్యం దృష్ట్యా ఇది మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.