📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Flight services:భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణ

Author Icon By Pooja
Updated: October 27, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-చైనా మధ్య గల్వాన్ సంఘర్షణల తర్వాత దాదాపు ఐదేళ్లుగా నిలిచిపోయిన విమాన సర్వీసులు(Flight services) మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం(Netaji Subhash Chandra Bose International Airport) నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి ఇండిగో తొలి వాణిజ్య విమానం బయలుదేరింది. 176 మంది ప్రయాణికులతో 6E1703 నంబర్‌ విమానం రాత్రి 10 గంటలకు ఎగిరి, సోమవారం ఉదయం 4 గంటలకు గ్వాంగ్‌జౌలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికులు దీపాలు వెలిగించి పునరుద్ధరణను ఆనందంగా జరుపుకున్నారు.

Read Also: TG Crime: ప్రాణంమీదకు తెచ్చిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. పెళ్లి

Flight services:భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణ

కోల్‌కతా నుంచి గ్వాంగ్‌జౌకు మొదటి విమానం

దీంతో పాటు గ్వాంగ్‌జౌ నుంచి కూడా ఇండియాకు విమానం బయలుదేరింది. నవంబర్ 9 నుంచి షాంఘై-దిల్లీ, నవంబర్ 10 నుంచి దిల్లీ-గ్వాంగ్‌జౌ మార్గాల్లో కూడా విమానాలు(Flight services) తిరిగి ప్రారంభం కానున్నాయి. చైనా డిప్యూటీ కాన్సుల్ జనరల్ క్విన్ యోంగ్ ఈ పరిణామంపై స్పందిస్తూ, “ఇది భారత్-చైనా సంబంధాల్లో కీలక దశ” అని అన్నారు. కోవిడ్ మహమ్మారి, గల్వాన్ ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

కోవిడ్‌కు ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ, కున్మింగ్‌ నగరాల నుంచి భారతదేశంలోని దిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులు ఉండేవి. వాటిని పునరుద్ధరించేందుకు చైనా గత సంవత్సరం నుంచే భారత్‌తో చర్చలు ప్రారంభించింది. ఈ ఏడాది భారత్-చైనా దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. జనవరిలో భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ చైనాను సందర్శించిన తర్వాత ఇరుదేశాలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

లద్దాఖ్ సరిహద్దులో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ, గస్తీ పునరుద్ధరణ ఒప్పందం తర్వాత ఈ అంశంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ఇటీవల జరిగిన మోదీ-జిన్‌పింగ్ సమావేశంలో కూడా ఈ విషయంపై అంగీకారం కుదిరింది. చివరికి ఐదేళ్ల తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి.

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయి?
కోవిడ్-19 మహమ్మారి మరియు గల్వాన్ లోయ ఘర్షణల కారణంగా 2020లో ఇరు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

మొదటి విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది?
కోల్‌కతా నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు ఇండిగో తొలి వాణిజ్య విమానం బయలుదేరింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India-China Flights Indigo Airlines Kolkata Guangzhou Flight Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.