Flight death incident : ఫ్లైట్‌లో ప్రయాణికురాలు మృతి, మృతదేహంతో ప్రయాణం

Read Time:  1 min
Flight death incident
Flight death incident
FONT SIZE
GET APP

Flight death incident : హాంకాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 60 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా మరణించడం ప్రయాణికులను షాక్‌కు గురిచేసింది. విమానం మధ్యలోనే తిరిగి మళ్లించకుండా, 331 మంది ప్రయాణికులతో పాటు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లడం మరింత చర్చనీయాంశమైంది.

Read Also:Dhurandhar 2 Collections: 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు

Flight death incident
Flight death incident

విమాన సిబ్బంది మృతదేహాన్ని బాత్రూమ్‌లో ఉంచాలని భావించినప్పటికీ, కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో గ్యాలీ ప్రాంతంలో ఉంచగా, కొంతసేపటి తర్వాత దుర్వాసన రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. లండన్ చేరుకున్న తర్వాత ప్రయాణికులను 45 నిమిషాల పాటు సీట్లలోనే ఉంచి దర్యాప్తు నిర్వహించారు. ఐఏటీఏ మార్గదర్శకాల ప్రకారం గాల్లో జరిగిన మరణాలను ఎమర్జెన్సీగా పరిగణించరని, సిబ్బంది నిబంధనలు పాటించారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.