కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన కాల్పుల్లో 34 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథిక్ చర్చిలో అలైడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు (Members of the Democratic Forces) ఆదివారం తెల్లవవారుజామున కాల్పులకు తెగబడ్డారు. తిరుగుబాటుదారులు దాదాపు 34 మందిని కాల్చిచంపారు.ఈఘటనలో అనేక ఇళ్లు, దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
కొనసాగుతున్న సహాయచర్యలు
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు సైనిక అధికారులు తెలిపారు. కాంగో సైనిక ప్రతినిధి సైతం ఈ దాడులను ధ్రువీకరించారు. ఇస్లామిక్ట్తో సంబంధం ఉన్న ఏడీఎఫ్ తిరుగుబాటు సంస్థ ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ఆఫ్ కాంగో (Democratic Republic of the Congo) సరిహద్దు ప్రాంతాల్లో పౌరులపై దాడులకు తెగబడుతోంది. ఈనెల ప్రారంభంలో ఈ బృందం ఇటురీలోఅనేకులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి రక్తపాతం అని అభివర్ణించారు.
కత్తులతో చొరబడ్డారు
ఈ దాడికి సంబంధించి ఇటురిలోని ఆర్కీ ప్రతినిధి మాట్లాడుతూ ఆదివారం ఉదయం కోమాండాకు సమీపంలో ఉన్నచర్చిలోకి కొంతమంది సాయుధులు కత్తులతో చొరబడ్డారు. వారి దాడిలో అక్కడ ఉన్న సుమారు 10మంది మరణించారు.అక్కడి దుకాణాలకు కూడా నిప్పుపెట్టారు. భద్రతా అధికారులు ఉన్న పట్టణంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటంనమ్మశక్యంగా లేదని సదరు అధికారు చెప్పారు. ఏడీఎఫ్కు ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నాయి. ఇది ఉగాండా-కాంగోమధ్య సరిహద్దు ప్రాంతంలో పనిచేసే ఓ తిరుగుబాటు సంస్థ.
1990ల చివరలో ఉగాండాలో యోవేరి ముసేవేనిపై
అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఏడీఎఫ్గ ఏర్పడింది. ఇది పౌరులపై నిరంతరం కాల్పులకు తెగబడుతోంది. 2002లోఉగాండా దళాల సైనిక దాడుల తరువాత, ఈ బృందం తన కార్యకలాపాలను డీఆర్సీకి తరలించింది. అప్పటి నుంచివేలాదిమందిపై హత్యలకు పాల్పడుతోంది.సాయుధ తిరుగుబాటు వల్ల అమాయక ప్రజలు చనిపోవడం విచాకరమని అక్కడి అధికారులు వాపోతున్నారు.దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాలకు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి రావడంతో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండాపోతున్నది.
కాంగో దేశం ఎక్కడ ఉంది?
కాంగో అఫ్రికా ఖండంలో ఉంది. ఇది మధ్య ఆఫ్రికాలో ఉన్న దేశం.
కాంగోకు పూర్తి పేరు ఏమిటి?
కాంగో దేశానికి పూర్తి పేరు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of the Congo).
Read Hindi News : hindi.vaartha.com
Read also : Operation Sindoor : త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోయింది ..రాజ్‌నాథ్ సింగ్