📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 7 భవనాలు దగ్ధం, 128 మంది మృతి

Author Icon By Pooja
Updated: November 29, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాంకాంగ్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనలో ఏకంగా ఏడు భారీ నివాస భవనాలు దగ్ధం కాగా, 128 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన అగ్నిప్రమాదానికి ఒక సిగరెట్ పీక కారణమైందన్న ప్రచారం సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతోంది.

Read Also: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి

Fire Accident: Massive fire in Hong Kong: 7 buildings burnt down, 128 people killed

అగ్ని ప్రమాదానికి కారణంపై అనుమానాలు

మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో, కార్మికుల్లో ఒకరు కాల్చి పడేసిన సిగరెట్ పీక వల్లే నిప్పు అంటుకుందని, క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగసిపడ్డాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం(Fire Accident) జరిగిన ప్రదేశంలోనే ఒక కార్మికుడు సిగరెట్ కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అగ్ని ప్రమాదానికి కారణం ఆ కార్మికుడు కాల్చిన సిగరెట్ పీకేనని ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ ప్రచారాన్ని అధికారులు మాత్రం నిర్ధారించలేదు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.

ప్రమాద స్థలం వివరాలు

ఈ ప్రమాదం తైపోలోని వాంగ్ ఫక్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగింది. 1983లో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో ఒక్కో టవర్ 31 అంతస్తుల చొప్పున మొత్తం ఎనిమిది భారీ టవర్లు ఉన్నాయి. మొత్తంగా 2 వేలకు పైగా ఫ్లాట్‌లు ఉన్నాయి. ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదంలో ఇందులోని ఏడు టవర్లు బుగ్గిపాలయ్యాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Cigarette Butt Cause Google News in Telugu Hong Kong Fire Accident Latest News in Telugu Residential Complex Fire

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.