📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Trump Tariffs: ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు చెల్లించక తప్పదా?

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia)తో చమురు వ్యాపారం చేయకూడదని.. దాని ద్వారా ఆ దేశం ఉక్రెయిన్(Ukraine) తో యుద్ధం మానేసేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) భారత్(India) పై వత్తిడి తీసుకువచ్చారు. 24 గంటలు టైమ్ ఇచ్చి…తన మాట వినకపోతే అప్పటికే విధించిన 25 శాతం సుంకాలతో పాటూ అదనంగా మరో 25 శాతం విధిస్తామని బెదిరించారు. అయితే భారత్.. ట్రంప్ మాట వినలేదు. ఎవరితో వాణిజ్యం చేయాలనేది తమకు బాగా తెలుసునని ధీటుగా సమాధానం చెప్పింది. దీంతో ట్రంప్…ఇండియాపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇవి ఆగస్టు 27 నుంచి అమలు అవుతాయని చెప్పారు.

Trump Tariffs: ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు చెల్లించక తప్పదా?

కొనసాగుతున్న బ్రిక్స్ దేశాలు..అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం..
అప్పుడే అదే రోజు మొదైలంది ప్రపంచ వాణిజ్య యుద్ధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు, బ్రిక్స్ దేశాలు మరోవైపు అయిపోయాయి. బ్రిక్స్ దేశాల ఆటలు సాగవని…డాలర్ తో పాటూ అమెరికా పతనం కానివ్వనని ట్రంప్ అంటున్నారు. మరోవైపు అమెరికా ఆధిపత్యం ఇక చెల్లదని బ్రిక్స్ దేశాలు చెబుతున్నాయి. అదనపు సుంకాలతో అమెరికా అధ్యక్షుడు అన్యాయంగా, అసమంజసంగా ప్రవర్తిస్తున్నారని భారత్ ఆరోపించింది. దీనికి రష్యా వత్తాసు పలికింది. దాంతో పాటూ ఇండియాకు శత్రువు అయిన చైనా కూడా ఈసారి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని తొమ్మిదేళ్ళ తర్వాత చైనా కూడా వెళ్ళనున్నారు. అప్పుడు సుంకాల మీద చర్చలు జరగవచ్చని చెబుతున్నారు. రష్యా, చైనా, భారత్ కలిస్తే అమెరికాకు కష్టం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ ను తిట్టిపోస్తున్న సొంత పార్టీలో నేతలు
మరోవైపు ట్రంప్ సుంకాల నిర్ణయం పట్ల సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అక్కడి అమెరికా అధ్యక్షుడి సొంత పార్టీలో నేతలతో పాటూ ఆర్థికవేత్తలు, మాజీ అధికారులు కూడా తిట్టిపోస్తున్నారు. భారత్ తో తగవు పెట్టుకుని ట్రంప్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని చెబుతున్నారు. తన గోతిని తానే తవ్వుకుంటున్నారని…అమెరికా పతనానికి దారి తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు సుంకాల వలన అమెరికాలోనే ధరలు ఎక్కువ అవుతాయని..మరింత ఆర్థికంగా పతనం అవుతుందని చెబుతున్నారు. దీని ప్రభావం అప్పుడే కనిపిస్తోంది కూడా. సుంకాల భారం తగ్గించుకోవడానికి అమెరికాలోని బడా కంపెనీలు భారత్ నుంచి సరుకు వద్దని చెబుతున్నారు. దీంతో అక్కడి వాల్ మార్ట్, టార్గెట్ ల్లాంటి వాటిల్లో ధరలు పెరుగుదల కనిపిస్తోంది.
ట్రంప్ వీటని వెనక్కు తీసుకుంటారా లేదా?
ఇక భరాత్ పై అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. అయితే ఇవి అమలు కావని…ట్రంప్ వీటని వెనక్కు తీసుకుంటారని ప్రపంచ ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. పాక్ ఆర్థిక వేత్త ఒకరు కూడా ఇదే మాట చెప్పారు. ఈ లోపునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. ఆగస్టు 15న వీరిద్దరూ అలస్కాలో కలవనున్నారు. ఈ భేటీలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ, శాంతి ఒప్పందంపై చర్చించనున్నారు. ఇందులో కనుక ట్రంప్ సక్సెస్ అయి రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తే…అదనపు సుంకాల నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు వెనక్కు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కూడా దీనిపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సుంకం మరియు ఉదాహరణ అంటే ఏమిటి?
సరళంగా చెప్పాలంటే సుంకం అంటే ఏమిటి? సుంకం అంటే ఒక దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులు మరియు సేవలపై విధించే పన్ను. ఇది సాధారణంగా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరను పెంచడానికి ఉపయోగించబడుతుంది, తద్వారా అవి దేశీయ వస్తువులు మరియు సేవల కంటే ఖరీదైనవిగా మారుతాయి, తద్వారా దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.

4 రకాల సుంకాలు ఏమిటి?
వర్తించే నాలుగు ప్రధాన రకాల సుంకాలు ఉన్నాయి - నిర్దిష్ట సుంకాలు, కాంపౌండ్ సుంకాలు, ప్రకటన విలువ (విలువ ప్రకారం) మరియు సుంకం-రేటు కోటా. ఈ రకాల సంక్షిప్త వివరణ ఇక్కడ ఉంది: నిర్దిష్ట సుంకాలు: ఒక ఉత్పత్తి విలువతో సంబంధం లేకుండా నిర్దిష్ట సుంకం విధించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/general-elections-when-are-the-general-elections-in-bangladesh/international/528411/

Economy Government Policy Import Duty Tariff taxes Telugu News Trade

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.