Fern Winter Storm Usa: అమెరికాను కుదిపేస్తున్న భారీ మంచు తుఫాను ‘ఫెర్న్ (Fern)’ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తుఫాను ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు దాదాపు 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అధికారుల సమాచారం ప్రకారం, జనవరి 23 శుక్రవారం ప్రారంభమైన ఈ మంచు తుఫాను ప్రభావం జనవరి 26 వరకు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని దక్షిణ (South), మిడ్-వెస్ట్ (Midwest), నార్త్-ఈస్ట్ (North-East) ప్రాంతాలు ఈ తుఫాను ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి.
Read Also: దావోస్‌లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలకు వెనక్కి తగ్గిన ట్రంప్
ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 23 కోట్ల మంది ప్రజలు ఫెర్న్ తుఫాను గుప్పిట్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీగా మంచు కురవడం, తీవ్రమైన చలిగాలులు, ఐస్ స్టార్మ్ పరిస్థితుల కారణంగా సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో రహదారులు మంచుతో కప్పబడి, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు రద్దు కావడం, రైలు సేవలకు అంతరాయం కలగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Fern Winter Storm USA: America is in the grip of Storm Fern.
అదేవిధంగా, కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అవసరమైన ఆహారం, మందులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల బృందాలను అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఫెర్న్ తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు పూర్తి జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: