📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: America: మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ (US Federal Reserve) తన అక్టోబర్ 2025 మానిటరీ పాలసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. జెరోమ్ పావెల్ నేతృత్వంలోని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) 25 బేసిస్ పాయింట్లు తగ్గించి వడ్డీ రేట్లను 3.75% నుండి 4.00 శాతం పరిధికి చేర్చింది. ఈ నిర్ణయం అక్టోబర్ 29, 2025న విడుదలైన అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది. ఇది 2025లో రెండోసారి వడ్డీ రేట్లలో కోత. సెప్టెంబర్ 2025లో మొదటిసారిగా రేట్లు తగ్గించిన ఫెడ్, ఇప్పుడు ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అలాగే అమెరికా ప్రభుత్వ మూత (shutdown) కారణంగా ఆర్థిక డేటా లభ్యం కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: America: EAD ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేసిన అమెరికా

America

భవిష్యత్తులో మరిన్ని కోతలు

ఫెడ్ సభ్యులలో 10 మంది ప్రస్తుత నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఒకరు 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాలని కోరగా, మరొకరు రేట్లను యథాతథంగా ఉంచాలని సూచించారు. దేశ ఆర్థిక దృక్పథం, నష్టాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ నిధుల రేటు లక్ష్య పరిధిని 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గించామని FOMC పేర్కొంది. డిసెంబర్ 2025 సమావేశంలో మరొక వడ్డీ రేటు తగ్గింపు ఉంటుందా అన్న ప్రశ్నపై చైర్మన్ జెరోమ్ పావెల్ స్పందించారు. డిసెంబర్‌లో మరో రేటు కోత ముందుగానే నిర్ణయించబడింది అనుకోవడం తప్పు. అది పూర్తిగా ఇన్‌కమింగ్ ఆర్థిక డేటాపైనే ఆధారపడి ఉంటుందని పావెల్ స్పష్టం చేశారు. అంటే, భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండవచ్చు కానీ అవి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఉంటాయని ఆయన చెప్పారు.

సుంకాల పెరుగుదలపై వస్తువుల ధరల ప్రభావం

సెప్టెంబర్ 2025తో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధర సూచీ (CPI) ద్రవ్యోల్బణం 2.9 శాతం నుండి 3 శాతానికి పెరిగింది. ట్రంప్ ప్రభుత్వం విదేశీ వస్తువుల దిగుమతులపై సుంకాలు పెంచడం వల్ల వస్తువుల ధరలు ఎగసి ద్రవ్యోల్బణం పెరిగిందని పావెల్ అన్నారు. సుంకాల పెరుగుదల వస్తువుల ధరలను పెంచింది. ఇది దీర్ఘకాల ద్రవ్యోల్బణ ధోరణిని తారుమారుచేస్తుందని ఆయన హెచ్చరించారు. 2025లో అమెరికా ఉద్యోగ వృద్ధి మందగించింది. నిరుద్యోగిత రేటు పెరిగిందని FOMC నివేదికలో పేర్కొంది. జెరోమ్ పావెల్ మాట్లాడుతూ వలసల సంఖ్య తగ్గిపోవడం వల్ల శ్రామికుల సరఫరా తగ్గిపోయింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు దిశపై అనిశ్చితి

దీని ఫలితంగా కార్మిక మార్కెట్ మందగించి, ఉద్యోగ సృష్టి వేగం తగ్గిందని తెలిపారు. ఫెడ్ ప్రకారం, అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు దిశపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోందని అంగీకరించింది. ఆర్థిక దృక్పథం గురించి అనిశ్చితి ఎక్కువగా ఉంది. ఇన్‌కమింగ్ డేటా, రిస్క్‌లు, ఆర్థిక సమతుల్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని FOMC పేర్కొంది. ఫెడ్ దీర్ఘకాల లక్ష్యం గరిష్ట ఉపాధి, 2 శాతం ద్రవ్యోల్బణం సాధించడం అని స్పష్టం చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ యొక్క తాజా వడ్డీ రేటు కోత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Federal Reserve inflation interest rates Jerome Powell Latest News Breaking News Monetary Policy Telugu News US Economy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.