📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest News: Myanmar: మయన్మార్‌ సైబర్‌ కేంద్రాలపై సైనిక దాడుల భయం

Author Icon By Aanusha
Updated: October 27, 2025 • 7:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్‌ (Myanmar) లో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ మోసాల కథ ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అక్కడికి ఉద్యోగాల పేరుతో వెళ్లి చిక్కుకున్న వేలాది మంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇటీవలే బయటపడింది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తం కావడంతో… మయన్మార్ నుంచి థాయిలాండ్ సరిహద్దు వైపు భారీ ఎగ్జోడస్ మొదలైంది.

Read Also: Donald Trump: కెనడాపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

థాయిలాండ్‌ (Thailand) లోని మేయ్‌సోట్ సరిహద్దు జిల్లాలోకి బుధవారం నుంచి శుక్రవారం మధ్యలో వెయ్యి మందికి పైగా వ్యక్తులు ప్రవేశించారని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. థాయిలాండ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ఖావ్‌సోద్’ ప్రకారం, వారిలో 399 మంది భారతీయులు, 147 మంది చైనీయులు, 31 మంది థాయిలాండ్ పౌరులు ఉన్నారు.

మిగతావారు మయన్మార్, ఇతర దేశాలకు చెందిన వారని అధికారులు పేర్కొన్నారు.మయన్మార్‌ (Myanmar) లో కేకే పార్క్‌ వంటి భారీ కాంపౌండ్‌లను అడ్డాగా చేసుకుని అంతర్జాతీయ సైబర్‌ ముఠాలు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, వేలాది మందిని ఇక్కడ నిర్బంధించి సాయుధ సిబ్బంది పర్యవేక్షణలో బలవంతంగా నేరాలు చేయిస్తున్నాయి.

Myanmar

నేపాల్‌కు చెందిన వారు కూడా

బాధితుల్లో భారత్‌తో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్‌, ఇథియోపియా, పాకిస్థాన్‌, ఇండోనేసియా, నేపాల్‌కు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఇలాంటి సైబర్‌ మోసాల బారిన పడిన భారతీయులను కాపాడటం ఇదే మొదటిసారి కాదు.

ఈ ఏడాది మార్చి నెలలో కూడా మయన్మార్‌-థాయిలాండ్‌ సరిహద్దుల్లోని సైబర్‌ కేంద్రాలపై దాడులు నిర్వహించి 549 మంది భారత పౌరులను రక్షించారు. వీరిని రెండు ప్రత్యేక సైనిక విమానాల్లో భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో సైబర్‌ బానిసత్వం సమస్య మరోసారి తీవ్రరూపం దాల్చింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Myanmar cyber scams Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.