📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Starlink: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్స్‌..భూ కక్ష్య భద్రతకు ముప్పు

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్‌లింక్(Starlink) ఉపగ్రహాలు స్పేస్‌లో తిరుగుతుంటాయి. అయితే ఈ శాటిలైట్స్‌ తరచుగా భూ వాతావరణంలోకి పడిపోతున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం వల్ల భూ కక్ష్య భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్‌ రియాక్షన్ ఉండే ఛాన్స్‌ ఉందని జోనాథన్‌ మెక్‌డోవెల్‌ అనే ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్‌లింక్‌ శాటిలైట్‌లు భూ వాతావరణంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Read also: Henley Passport: కల తప్పిన అమెరికా పాస్‌పోర్ట్‌

Starlink: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్స్‌..భూ కక్ష్య భద్రతకు ముప్పు

కక్ష్యలో 8 వేలకు పైగా స్టార్‌లింక్‌ శాటిలైట్లు

భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్‌, అమెజాన్‌కు చెందిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరికొన్ని శాటిలైట్లు కక్ష్యలోకి ప్రవేశించనున్నాయని దీంతో వీటి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం చూసుకుంటే కక్ష్యలో 8 వేలకు పైగా స్టార్‌లింక్‌ శాటిలైట్లు ఉన్నాయని.. చైనా మరో 20 వేల శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. స్టార్‌లింక్‌ ఉపగ్రహం దాదాపు 5 నుంచి ఏడేళ్ల వరకు కక్ష్యలో ఉంటాయని.. ఆ తర్వాత వాటికవే భూమిపై రాలిపోతాయని పేర్కొన్నారు. కొన్నిసార్లు శాటిలైట్‌ సిస్టమ్స్‌లో ఏదైనా వైఫల్యాలు జరిగినా కూడా అవి పడిపోతాయని చెప్పారు.

భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు ముప్పు

శాటిలైట్లు, రాకెట్‌ శకలాల సంఖ్య పెరిగి అంతరిక్ష్య వర్థాలు ఎక్కువైతే కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్‌ రియాక్షన్‌ ఏర్పడి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందన్నారు. దీంతో కక్ష్యలోని ఇతర శాటిలైట్‌లను కూడా ఢీకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు కూడా ముప్పు ఉంటుందన్నారు. ముఖ్యంగా స్టార్‌లింక్‌ ఉపగ్రహాలను తరచుగా కక్ష్యలో ప్రవేశపెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ సమస్య ఏర్పడి మానవాళికి సవాల్‌గా మారుతుందని పేర్కొన్నారు. అంతేకాదు రాబోయే పదేళ్లలో ఎలాన్‌ మస్క్‌ మరో 10 వేల ఉపగ్రహాలు పంపించే ఛాన్స్ ఉందన్నారు.

స్టార్‌లింక్ దేనికి ఉపయోగించబడుతుంది?
స్టార్‌లింక్ ఉపగ్రహాల గురించి స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు కొన్ని వాస్తవాలను వెల్లడిస్తారు
స్టార్‌లింక్ తక్కువ-భూమి కక్ష్యలో వేలాది ఉపగ్రహాల సమూహాన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు హై-స్పీడ్, తక్కువ-జాప్యం బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవను అందిస్తుంది.

భారతదేశంలో స్టార్‌లింక్ ఎవరిది?
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ భారతదేశం కోసం కొత్త 'స్టార్‌లింక్' ప్రణాళికను కలిగి ఉండవచ్చు ...
స్టార్‌లింక్ ఇండియా స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ యొక్క మాతృ సంస్థ ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలో ఉంది. ఈ సేవ స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, ఇది బహిరంగంగా వర్తకం చేయబడదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Latest News Breaking News orbital safety threat satellite crash risk satellite reentry space debris issue space news Starlink malfunction Starlink satellites falling Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.