📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Explosion: సింగపూర్‌ కంటైనర్ షిప్‌లో సంభవించిన పేలుడు

Author Icon By Sudha
Updated: June 9, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింగపూర్‌కు చెందిన కంటైనర్ షిప్‌ (Container ship)లో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌(Rescue operation) కోసం ఇండియన్‌ నేవీ రంగంలోకి దిగింది.

Explosion: సింగపూర్‌ కంటైనర్ షిప్‌లో సంభవించిన పేలుడు


రక్షణ చర్యలు
సింగపూర్‌కు చెందిన MV Wan Hai 503 అనే కంటైనర్ షిప్‌లో 2025 జూన్ 9న ఉదయం కేరళ తీరంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది బోటు వదిలి బయటకు రాగా, భారత నేవీ మరియు కోస్ట్ గార్డ్ సహాయంతో వారిని రక్షించారు. అయితే, ఈ ప్రమాదంలో నాలుగు మంది సిబ్బంది గల్లంతయ్యారు మరియు ఐదు మంది గాయపడ్డారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
సోమవారం ఉదయం కేరళ తీరంలో సింగపూర్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ ఎంవీ వాన్ హై 503లో పేలుడు సంభవించింది. ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా కొచ్చిలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్‌కు సమాచారం అందినట్లు రక్షణ శాఖ తెలిపింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం ఇండియన్‌ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పింది. కొచ్చిలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సూరత్‌ను ఆ కంటైనర్ షిప్‌ వద్దకు పంపినట్లు వెల్లడించింది.
కాగా, 12.5 మీటర్ల వెడల్పు, 270 మీటర్ల పొడవున్న ఈ కంటైనర్ షిప్‌ జూన్ 7న కొలంబో నుంచి బయలుదేరింది. జూన్ 10న ముంబైకు చేరుకోవాల్సి ఉన్నది. అయితే సోమవారం ఉదయం 10.30 గంటలకు షిప్‌ డెక్‌ కింద నుంచి పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మంది ఆ నౌకను వీడి బోటులో ప్రయాణించారు. ఇండియన్‌ నేవీ, కోస్ట్‌గార్డ్‌ దళాలువీరిని రక్షించాయి.
మరోవైపు మంటల్లో చిక్కుకున్న సింగపూర్ కంటైనర్ షిప్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండియన్‌ నేవీ తెలిపింది. నేవీ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

Read Also:Malaysia: మలేషియా రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

Breaking News in Telugu Explosion on Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Singapore container ship Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.