ఇరాన్, ఇటీవల గాజా మరియు ఇతర పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ( Israel)నిర్వహిస్తున్న దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే (Nuclear power plants)లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు (IDF forces)దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించాలని ఇరాన్ దౌత్యవేత్త కోరారు.
భారత్ తటస్థ వైఖరి
ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ.. ‘భారత్ అధికారులతో మేము చర్చలు జరిపాం. ఇజ్రాయెల్-ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరితో ఉంది. ఎందుకంటే రెండు దేశాలతోనూ భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఇరాన్-ఇజ్రాయెల్ సమస్యకాదు. ఒక దేశంపై దురాక్రమణకు సంబంధించిన విషయం. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని ఖండించాలి. గ్లోబల్ సౌత్‌కు ఇండియా లీడర్. ఇజ్రాయెల్ దాడులను న్యూ ఢిల్లీ వ్యతిరేకించాలని ఇరాన్ ఆశిస్తోంది. భారత్‌తోపాటూ ప్రతి దేశం ఇజ్రాయెల్ దాడులను ఖండించాలి’ అని పేర్కొన్నారు.ఇరాన్ అధికార ప్రతినిధులు, ప్రత్యేకంగా భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘న్యూఢిల్లీ ఈ దాడులను ఖండించాలి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. భారత్ వంటి శాంతికాముక దేశం ఇలాంటి దాడులను నిశబ్ధంగా గమనించకూడదు’ అని అభిప్రాయపడ్డారు.
ఇరాన్ కీలక నిర్ణయం
మరోవైపు జ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో తమ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం వల్ల మూసి ఉంచిన ఇరాన్ గగనతలాన్ని భారత విమానాల కోసం తెరిచింది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులు, పౌరుల కోసం కేంద్రం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. అందులో భాగంగా సుమారు 1000 మందిని మూడు విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వస్తున్నారు. అందులో మొదటి విమానం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఇరాన్ నుంచి రావాలనుకున్న మన వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఇరాన్, ప్రపంచంలోని అన్ని దేశాలు – ప్రత్యేకించి ఆసియా దేశాలు – ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించాలని కోరింది. ఫిలస్తీన్ ప్రజలపై జరుగుతున్న అణచివేతను నిలిపేయడానికి ఐక్యంగా వత్తిడికి దిగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.ఇరాన్ వ్యాఖ్యలు భారత్-ఇజ్రాయెల్ సంబంధాల నేపథ్యంలో గమనించదగినవే. భారత్ రెండు దేశాలతో కూడా బలమైన వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు, టెక్నాలజీ తీసుకుంటుంటే, మరోవైపు ఇరాన్‌తో చమురు మరియు ప్రాంతీయ రాజకీయాల్లో భాగస్వామ్యం ఉంది.భారతదేశం ఇప్పటివరకు ఈ అంశంపై సమతుల్యంగా స్పందించడాన్ని ఎంచుకుంది. పౌరులపై దాడులు జరుగుతున్నప్పుడు, మానవతా విలువల ఆధారంగా ఖండన అవసరం అని మానవ హక్కుల సంస్థలు సూచిస్తున్నాయి.భారతదేశం ఇప్పటివరకు ఈ అంశంపై సమతుల్యంగా స్పందించడాన్ని ఎంచుకుంది. పౌరులపై దాడులు జరుగుతున్నప్పుడు, మానవతా విలువల ఆధారంగా ఖండన అవసరం అని మానవ హక్కుల సంస్థలు సూచిస్తున్నాయి.
Read Also:Trump: తులసి గబ్బార్డ్ చెప్పిన మాటల్లో నిజం లేదు: ట్రంప్