📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Europe: భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

Author Icon By Vanipushpa
Updated: December 19, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను వెనక్కి పంపిచేస్తున్న
సంగతి తెలిసిందే. ఇప్పుడు యూరప్‌(Europe) కూడా అమెరికా బాటలోనే నడుస్తోంది. భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల అభ్యర్థనలను తక్కువగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, ఈజిప్ట్, మొరాకో, కొలంబియా, ట్యునీషియా, కొసావో ఉన్నాయి. ఈ ఏడు దేశాలను సురక్షిత దేశాలుగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Europe

యూరప్‌ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ మధ్య ఒప్పందం

విచక్షణారహిత హింస జరగని దేశాలను తాము సురక్షిత దేశాలుగా భావిస్తున్నామని యూరప్ ప్రకటించింది. దీనిపై యూరప్‌ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ మధ్య ఒప్పందం కూడా జరిగింది. అయితే ఈ రూల్‌ తమకు వర్తించదని దరఖాస్తుదారులు నిరూపించుకోవాలి. 2026 జూన్‌ నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. దీన్ని ఇతర దేశాలకు కూడా విస్తరించనున్నారు. ఇది అమల్లోకి వచ్చాక ఆయా దేశాలు సురక్షితమని భావిస్తే తిరిగి శరణార్థులను వాళ్ల దేశాలకు పంపించే ఛాన్స్ ఉంటుంది. అయితే శారీరక హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నవాళ్లని మాత్రం తిరిగి వాళ్ల దేశాలకు పంపించకుండా మినహాయింపు ఇవ్వనున్నారు.

భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం

మరోవైపు ట్రంప్ ప్రభుత్వం కూడా శరణార్థులకు ఇచ్చే వర్క్‌ పర్మిట్‌ కాలవ్యవధిని కుదిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ (USCIS) ఇటీవల ప్రకటించింది. శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవాళ్లు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవాళ్లకి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాళ్ల కోసం ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ కింద పర్మిషన్లు జారీ చేస్తారు. దీనికి అయిదేళ్ల వరకు కాలవ్యవధి ఉండగా పలు సవరణలతో దాన్ని కేవలం 18 నెలలకు మాత్రమే కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

asylum seekers from India deportation of Indians Europe immigration policy European border control Google News in Telugu Indian refugees Latest News in Telugu refugee crisis in Europe Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.