Israel Iran conflict: ఇరాన్ చర్యల వల్ల కేవలం ఇజ్రాయెల్‌కే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పు పొంచివుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్యామిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఐరోపా దేశాల్లోకి కూడా చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లోని అరాద్ నగరంపై ఇరాన్ చేసిన క్షిపణి దాడుల ప్రాంతాన్ని ఆయన స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
Read Also: Iran-US War : మరోసారి అమెరికా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
Israel Iran conflict: పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు
ఇరాన్ కావాలనే సాధారణ పౌరులు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు పాల్పడుతోందని నెతన్యాహు విమర్శించారు. అయితే, ఇజ్రాయెల్ మాత్రం కేవలం ఇరాన్ పాలకులు ,ఉగ్రవాద నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ పాలకుల తీరు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హర్మూజ్ జలసంధిపై బ్లాక్‌మెయిల్ రాజకీయం
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అడ్డు పెట్టుకుని ఇరాన్ ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని నెతన్యాహు ఆరోపించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అరాద్ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: