ఇటలీ యువరాణి మరియా కరోలినా (Maria Carolina) ఇటీవల తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. కేవలం 21 ఏళ్ల వయస్సులో ఆమె మోటార్‌సైకిల్‌పై (On a motorcycle) ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించిన యువరాణి ఐసీయూలో చికిత్స పొందారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు.ఈ సంఘటనపై మరియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అదృష్టమే, అని ఆమె పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మోటార్‌సైకిల్ అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని తెలిపారు. దీంతో తాను ఐసీయూలో రీఅనిమేషన్ వార్డుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.ఆ ప్రమాదం గురించి చెబుతూ, హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను బతికాను అని స్పష్టంగా చెప్పారు. మోటార్‌సైకిళ్లు శక్తివంతమైనవే అయినా, అవి చిన్న పొరపాట్లను క్షమించవని గుర్తుచేశారు. దయచేసి జాగ్రత్తగా నడపండి. పూర్తి రక్షణతో వాహనాన్ని నడపండి అని సూచించారు.ఆసుపత్రిలో ఉన్న తన ఫోటోలు కూడా ఆమె షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి, ఫస్ట్ రెస్పాండర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే స్పందించి, నన్ను కాపాడిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
గ్రాండ్ ప్రీ & కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న యువరాణి
ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందు, మరియా మోంటే కార్లోలో గ్రాండ్ ప్రీ ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ ఆమె బ్రిటిష్ ఎఫ్1 రేసర్ లాండో నోరిస్‌తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ఇటీవలే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించాయి. తల్లి కెమిల్లా, చెల్లెలు కియారాతో దిగిన చిత్రాలు కూడా ఆమె పంచుకున్నారు.అంతకుముందు, మే 15న జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ ఆమె ఎలిగెంట్ అవుట్‌ఫిట్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
రాయల కుటుంబానికి చెందిన యువరాణి
మరియా కరోలినా, ప్రిన్స్ కార్లో మరియు ప్రిన్సెస్ కెమిల్లా కుమార్తె. ఆమెకు డచెస్ ఆఫ్ కాలాబ్రియా మరియు డచెస్ ఆఫ్ పలెర్మో అనే బిరుదులున్నాయి. ఆమె చెల్లెలు ప్రిన్సెస్ కియారాకు డచెస్ ఆఫ్ నోటో మరియు డచెస్ ఆఫ్ కాప్రి బిరుదులున్నాయి.
జాగ్రత్తే జీవితం – యువరాణి హెచ్చరిక
ఈ ప్రమాదం తర్వాత యువరాణి అందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. జీవితం విలువైనది. రోడ్డు మీద ఒక్క సెకెన్డు అజాగ్రత్త సరిపోతుంది. పూర్తి రక్షణ లేనిదే ఎప్పుడూ వాహనం నడపవద్దు అని స్పష్టం చేశారు.
Read Also : America :తెలుగు విద్యార్థులకు అమెరికా అవకాశాలు తగ్గిపోతున్నాయా?