📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Trump: ఒబామా, సతీమణి మిషెల్లీ కోతులుగా చిత్రీకరిస్తూ వీడియో

Author Icon By Vanipushpa
Updated: February 7, 2026 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిపబ్లిక్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన వీడియో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యం ట్రూత్ సోషల్ పోస్ట్ చేస్తూ.. మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆరోపణలు చేశారు. బ్యాలెట్ లెక్కింపు కంపెనీ డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ 2020 ఎన్నికల్లో తన విజయాన్ని లాక్కోడానికి సహాయపడిందని ఆరోపించారు. వీడియో చివరలో ఒబామా(Obama) దంపతులను కోతులుగా చిత్రీకరించారు. కోతుల శరీరాలకు మాజీ అధ్యక్ష దంపతుల ముఖాలను అతికించారు. బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్లీ ఒబామా కనిపించే వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ది లైన్ స్లీప్స్ టునైట్’ అనే పాటను పెట్టారు.

Read Also: Trade Deal: చమురు దిగుమతులకు వెనిజులా వైపుకు భారత్ అడుగులు

Trump: ఒబామా, సతీమణి మిషెల్లీ కోతులుగా చిత్రీకరిస్తూ వీడియో

మన చరిత్రపై ట్రంప్ ను ఒక మచ్చగా చూస్తారు

ఈ వీడియోపై కాలిఫోర్నియా గవర్నర్, ట్రంప్‌పై తరుచూ విమర్శలు గుప్పించే గవిన్ న్యూసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ నేత ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028 అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్నవారిలో గవిన్ ఒకరు. ‘అధ్యక్షుడి ప్రవర్తన అత్యంత అసహ్యకరమైంది.. ప్రతి రిపబ్లికన్ దీనిని ఖండించాలి’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు, ఒబామా సన్నిహితుడైన బెన్ రోడెస్‌ స్పందిస్తూ.. ట్రంప్ చరిత్రకు మాయని మచ్చలాంటివారని, అతడి అనుచరులు కూడా ‘జాత్యహంకార’ అని కూడా ముద్ర వేశారని అన్నారు. ‘భవిష్యత్ అమెరికన్లు ఒబామాను ప్రియమైన వ్యక్తులుగా ఆలింగనం చేసుకుంటారని, అదే సమయంలో ఆయనను మన చరిత్రపై ఒక మచ్చగా చూస్తారు.. ట్రంప్, అతడి జాత్యహంకార అనుచరులను వెంటాడుతారు’ అని అన్నారు. అయితే, ట్రంప్ గతంలోనూ ప్రపంచ నాయకులను ఏఐ వీడియోల సాయంతో ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది కూడా ఒబామాను ఒవెల్ ఆఫీసులో అరెస్ట్ చేస్తున్నట్టు ఓ వీడియో రూపొందించారు. మరో నల్లజాతి నాయకుడు హకీమ్ జెఫ్రీస్‌ వ్యగ్యంగా చిత్రీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bollywood latest news celebrity scandal reports entertainment news update Epstein files controversy film industry buzz global controversy impact Social Media Reactions Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.