📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: ఎప్‌స్టీన్ ఆస్తిలో రూ.5 వేల కోట్లు ప్రేయసికే

Author Icon By Vanipushpa
Updated: February 2, 2026 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అతిపెద్ద కుంభకోణమైన సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein) మరణించి ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు సంబంధించిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో ఆయన వీలునామాకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్‌స్టీన్ తన 600 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5400 కోట్లకు పైగా) భారీ సామ్రాజ్యంలో సింహభాగాన్ని తన చివరి ప్రియురాలు, బెలారస్ సంతతికి చెందిన కరీనా షులియాక్‌కు రాసిచ్చినట్లు ఈ పత్రాలు ధృవీకరిస్తున్నాయి.

Read Also: Iran NuclearIssue: అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

America: ఎప్‌స్టీన్ ఆస్తిలో రూ.5 వేల కోట్లు ప్రేయసికే

ఆత్మహత్యకు రెండు రోజుల ముందు రాసిన వీలునామా

2019 ఆగస్టు 10న జైలులో ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 8న ఎప్‌స్టీన్ తన వీలునామాపై సంతకం చేశారు. దీని ప్రకారం.. కరీనా షులియాక్‌కు నగదు రూపంలోనే 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 420 కోట్లు) దక్కనున్నాయి. దీంతో పాటు విలాసవంతమైన ఆస్తులు కూడా ఆమెకు దక్కనున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద ప్రైవేట్ దీవి ‘లిటిల్ సెయింట్ జేమ్స్’తో పాటు పారిస్‌లోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్, పామ్ బీచ్ ప్రాపర్టీ, మాన్హాటన్‌లోని ఖరీదైన టౌన్ హౌస్‌లు ఇప్పుడు ఆమె వశం కానున్నాయి. కేవలం ఆస్తులే కాకుండా నిశ్చితార్థం సందర్భంగా ఆమెకు 33 క్యారెట్ల డైమండ్ రింగ్, మరో 48 వజ్రాలను కూడా ఎప్‌స్టీన్ కానుకగా ఇచ్చారని ఫైల్స్ పేర్కొంటున్నాయి.

కరీనా వృత్తిరీత్యా డెంటిస్ట్

బెలారస్‌లో పుట్టి పెరిగిన కరీనా వృత్తిరీత్యా డెంటిస్ట్. అయితే ఆమె ఎప్పుడూ ఆ వృత్తిని ప్రాక్టీస్ చేయలేదు. 2009లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు ఆమె వయస్సు కేవలం 20 ఏళ్లు. 2010 నుంచి ఎప్‌స్టీన్ మరణించే వరకు ఆమె ఆయనతోనే ఉన్నారు. ఎప్‌స్టీన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ప్రైవేట్ జెట్‌లో పారిస్ నుంచి న్యూజెర్సీకి వచ్చిన ప్రయాణికుల్లో కరీనా కూడా ఉన్నారు. ఎప్‌స్టీన్ జైలులో ఉరి వేసుకోవడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఫోన్‌లో మాట్లాడిన చివరి వ్యక్తి కూడా కరీనానే కావడం గమనార్హం. ఎప్‌స్టీన్ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఆయనను అసహ్యించుకుని వదిలేసినా.. కరీనా మాత్రం ఆయనకు అండగా నిలిచారు. దీనికి కారణం లేకపోలేదు. ఆమె తల్లికి ఖరీదైన వైద్యం చేయించడంతో పాటు బెలారస్ రాజధాని మిన్స్క్‌లో ఆమె తల్లిదండ్రులు నివసించే ఇంటికి ఎప్‌స్టీన్‌యే ఆర్థిక సాయం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Epstein assets Epstein estate high-profile cases inheritance controversy Jeffrey Epstein news legal battle scandal news Telugu News Paper wealth transfer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.