విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఉన్న సుమారు 35 లక్షల మంది ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ‘పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0’ (GPSP 2.0) లో భాగంగా సరికొత్త చిప్ ఆధారిత ఇపాస్ పోర్ట్ (ePassport) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సురక్షితంగా, వేగంగా మార్చడమే కాకుండా విదేశీ ఎయిర్‌పోర్టుల్లో ఎదురయ్యే ఇమ్మిగ్రేషన్ కష్టాలను తగ్గిస్తుంది. ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? మనం ప్రస్తుతం వాడుతున్న సాధారణ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఈ కొత్త ఇపాస్ పోర్ట్ (e-Passport) లో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ అమర్చబడి ఉంటుంది. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ యొక్క బయోమెట్రిక్ డేటా, ఫోటో , వేలిముద్రలు ఎన్క్రిప్టెడ్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి.
Read Also: Bangladesh: తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
‘స్మార్ట్ గేట్స్’ లేదా ‘ఈ-గేట్స్’ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి
పాస్‌పోర్ట్ మొదటి కవర్ మీద ఉండే చిన్న బంగారు రంగు గుర్తు ద్వారా దీనిని గుర్తించవచ్చు. ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. స్మార్ట్ గేట్ల ద్వారా వేగవంతమైన ప్రయాణం యూఏఈ లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణించే వారికి ఇది ఒక పెద్ద వరమని చెప్పాలి. ప్రస్తుతం దుబాయ్ వంటి ఎయిర్‌పోర్టుల్లో మాన్యువల్ ఇమ్మిగ్రేషన్ చెక్ కోసం 25 నిమిషాల వరకు సమయం పడుతుంది. కానీ, ఇ-పాస్‌పోర్ట్ ఉన్నవారు ‘స్మార్ట్ గేట్స్’ లేదా ‘ఈ-గేట్స్’ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. కేవలం యూఏఈ లోనే కాకుండా సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఈ ఆటోమేటెడ్ బోర్డర్ కంట్రోల్ సదుపాయాన్ని పొందవచ్చు. భద్రత & డేటా ప్రైవసీ కొత్త పాస్‌పోర్ట్‌లో అమర్చిన చిప్ వల్ల డేటా ట్యాంపరింగ్ లేదా పాస్‌పోర్ట్ ఫోర్జరీ చేయడం అసాధ్యం. అ
యూఏఈ భారతీయులు ఎలా అప్లై చేయాలి?
అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లేదా దుబాయ్‌లోని కాన్సులేట్ ద్వారా ప్రవాసులు ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 అక్టోబర్ 28 నుండి అన్ని కొత్త దరఖాస్తులు , రెన్యూవల్స్ GPSP 2.0 పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయి. మీరు ఆన్‌లైన్‌లో ఫోటోలు, సంతకాలు, పత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా బిఎల్ఎస్ (BLS) సెంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చు. ఫిబ్రవరి 5,గురువారం ధరలు ఇవే.. పాత పాస్‌పోర్ట్ పని చేస్తుందా? మీ పాత పాస్‌పోర్ట్ గడువు ముగిసే వరకు అది చెల్లుబాటులోనే ఉంటుంది. అయితే, తరచుగా విదేశీ ప్రయాణాలు చేసే వారు. భవిష్యత్తులో యూకే (UK ETA) లేదా యూరప్ (EU ETIAS) వంటి దేశాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే ఇ-పాస్‌పోర్ట్‌కు మారడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో డిజిటల్ వీసా నిబంధనలకు ఇ-పాస్‌పోర్ట్ అత్యంత అవసరం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: