లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై 22 పరుగుల తేడాతో గెలుపొంది,ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ (ICC) నుంచి ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుకు 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడమే కాకుండా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్లలో 2 పాయింట్ల కోత ఎదురైంది.ఈ మేరకు ఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నియమావళిలోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఈ శిక్షలు అమలయ్యాయి. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది.ఇంగ్లండ్‌ను అధిగమించి శ్రీలంక ఇప్పుడు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టేబుల్ టాపర్ ఆస్ట్రేలియా (Australia) కంటే కొంచెం వెనుకబడి ఉంది. ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇంగ్లండ్ పై 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడిందని ఐసీసీ తెలిపింది.
ప్రతిపాదిత శిక్ష
కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నేరాన్ని అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విధించిన ప్రతిపాదిత శిక్షను కూడా అంగీకరించాడు.దీని కారణంగా అధికారిక విచారణ అవసరం లేదు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, థర్డ్ అంపైర్ అహ్సాన్ రజా, నాలుగో అంపైర్ గ్రాహం లాయిడ్ (Graham Laloyd) ఈ అభియోగాలను మోపారు” అని ఐసీసీ పేర్కొంది.ఇదిలాఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ నెల 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.
ICC ఫుల్ ఫామ్ ఏమిటి?
ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటకు సంబంధించి గవర్నింగ్ బాడీగా పనిచేస్తుంది. క్రికెట్‌లో నియమాలు, టోర్నీల నిర్వహణ, ఆటగాళ్ల నిబంధనలు, అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయి.
ICC ప్రైవేట్ (లేదా), ప్రభుత్వ సంస్థనా?
క్రికెట్‌కు సంబంధించిన ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇది స్వతంత్ర ప్రైవేట్ సంస్థ (Independent private organization). ఇది ఏ దేశ ప్రభుత్వానికీ చెందినది కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు సంబంధించి నియమాలు నిర్ణయించే, టోర్నీలను నిర్వహించే గవర్నింగ్ బాడీగా పనిచేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rajiv Shukla: కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?