📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ENG vs IND: చరిత్ర సృష్టించిన జో రూట్

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్ జట్టులో కీలక బ్యాటర్‌గా నిలిచిన జో రూట్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌ (Test cricket) లో ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టిస్తూ, చరిత్రలో పేరు నిలిపాడు. భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఓవల్ వేదికగా ఆదివారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 137 బంతుల్లో సెంచరీ నమోదు చేసి తన కెరీర్‌లో 39వ టెస్ట్ శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని సంపాదించాడు.ఈ రికార్డుతో జో రూట్ (Joe Root) శ్రీలంక లెజెండరీ క్రికెటర్ కుమార సంగక్కరను వెనక్కి నెట్టాడు. సంగక్కర తన టెస్ట్ కెరీర్‌లో 38 శతకాలు సాధించగా, రూట్ ఆ రికార్డును ముందుగా సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో సమం చేసి, తాజా మ్యాచ్‌లో శతకం బాదడంతో అతన్ని అధిగమించాడు.

స్థానాలు పొందారు

ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక శతకాల రికార్డు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) (51) పేరిట ఉంది. అతని తరువాత జాక్వస్ కల్లీస్ (45), రికీ పాంటింగ్ (41) స్థానాలు పొందారు. ఇప్పుడు జో రూట్ (39) ఈ లిస్టులో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.ఆఖరి టెస్ట్‌లో 374 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 106 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జోరూట్.. హ్యారీ బ్రూక్(111) సాయంతో జట్టును ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో జోరూట్ పలు రికార్డ్‌లను తన పేరిట లిఖించుకున్నాడు.

ENG vs IND:

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో

టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక సార్లు 500 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2021-22లో భారత్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో జో రూట్ 737 పరుగులు చేశాడు. 2014లో భారత్‌తో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 518 పరుగులు, తాజా సిరీస్‌లో 500 ప్లస్ రన్స్ చేశాడు. 2012లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జోరూట్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌ల్లో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్‌లు రెండేసి సార్లు 500 ప్లస్ రన్స్ చేశాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున వ్యాలీ హామ్మోండ్, జాక్ హోబ్స్, కెన్ బార్రింగ్‌టన్ నాలుగేసి సార్లు 500 ప్లస్ రన్స్ చేశారు.

జో రూట్ ఏ జట్టుకు ఆడుతారు?

జో రూట్ ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జో రూట్ ప్రత్యేకత ఏమిటి?

జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శనతో, ఎక్కువ శతకాలు సాధించడం, కీలక సందర్భాల్లో జట్టుకు విజయాలు అందించడం ఆయన ప్రత్యేకత.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/google-ceo-sundar-pichais-entertaining-moments-with-commentary-in-the-oval-test/sports/525399/

Breaking News England star batter century India vs England Oval test Joe Root 39th test hundred Joe Root test cricket record Kumar Sangakkara record broken latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.