📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Saudi: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దుతో 25 లక్షల భారతీయ కార్మికులకు విముక్తి

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నో ఏళ్ళుగా బానిసత్వంలో మగ్గిపోతున్న బారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. సౌదీ అరేబియా(Saudi Arabia)లో మగ్గిపోతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ దేశంలో ఉన్న కఫాలా వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దాదాపు 1.3 కోట్ల వలసదారులకు భారీ ఊరట లభించింది. ఇందులో భారతీయు(India)లే 25లక్షల వరకు ఉంటారు. సౌదీలో కఫాలా స్పాన్సర్ షిప్ వ్యవస్థను 1950లో ప్రారంభించారు. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల ప్రవాహాన్ని నిర్వహణ కోసం దీనిని రూపొందించారు. సౌదీకు ఎవరు ఉపాధి కోసం వెళ్ళినా వారు ఈ కఫాలా వ్యవ్థతో ముడిపడి ఉంటారు. దీని గురించే తెలిసే కార్మికులు అక్కడికి వెళతారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదా అంతా ఈ కఫాలా వ్యవస్థదారుల చేతిలోనే ఉంటుంది.

Read Also: Microsoft CEO: ఏఐ తో భారీ ప్యాకేజీ అందుకున్న సత్య నాదెళ్ల

Saudi

75 లక్షల మంది భారతీయులే..

సౌదీలో పని చేసేవారు అక్కడికి వెళ్ళగానే తమ పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ తరువాత సదరు కార్మికుడు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి వెళ్ళాలన్నా యజమాని అనుమతి ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా కఫాలా వ్యస్ కిందకే వస్తుంది. దీని కారణంగా సౌదీలో ఎంతో చిక్కుకుని బాధలు పడిన వారు ఉన్నారు. దీనిపై మానవ హక్కుల సంఘాలు తరుూ విమర్శలు గుప్పిస్తూ ఉండేవి. స్పాన్సర్‌షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమరవాణాకు ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ సహా పలు ప్రపంచ సంస్థలు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు కఫాలా వ్యవస్థను రద్దు చేయడంతో అక్కడ కార్మికులకు స్వాతంత్య్రం లభించినట్టయింది. ఇప్పటీకే దీన్ని ఇజ్రాయెల్, బహ్రెయిన్ లు రద్దు చేశాయి. ఈ దేశాల్లోని దాదాపు 2.5 కోట్ల మంది మంది విదేశీ కార్మికులు కఫాలా వ్యవస్థ కింద పనిచేస్తుండగా.. వీరిలో 75 లక్షల మంది భారతీయులే.

సౌదీ అరేబియా పూర్తి పేరు ఏమిటి?
సౌదీ అరేబియా దేశ ప్రొఫైల్ - BBC న్యూస్
పూర్తి పేరు సౌదీ అరేబియా రాజ్యం. ఇది మధ్యప్రాచ్యంలో ఒక సంపూర్ణ రాచరికం, అధికారిక పేరు పత్రాలపై మరియు అధికారిక సందర్భాలలో ఉపయోగించబడుతుంది.

సౌదీ అరేబియా దేనికి ప్రసిద్ధి చెందింది?
సౌదీ అరేబియా యొక్క ప్రసిద్ధ విషయాలను కనుగొనండి: అద్భుతాలు వేచి ఉన్నాయి! » అగోడా ...
సౌదీ అరేబియా ఇస్లాం జన్మస్థలంగా, మక్కా మరియు మదీనా అనే రెండు పవిత్ర నగరాలకు నిలయంగా మరియు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉండటానికి ప్రసిద్ధి చెందింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Gulf Employment Indian Workers Kafala System Labour Reforms Middle East News Migrant Rights Saudi Arabia Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.