📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest Telugu News: Spain: ఆఫీసుకు తొందరగా వస్తోందని ఉద్యోగం నుంచి పీకేశారు

Author Icon By Vanipushpa
Updated: December 12, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రావాలి అని రూల్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంగతి కాస్త పక్కన పెడితే.. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఠంచనుగా ఆఫీసుకు రాకపోతే.. జీతాల్లో కోత విధిస్తారు. అయితే సమయం కంటే ముందే ఆఫీసుకు వచ్చిన ఓ ఉద్యోగినికి.. ఆ కంపెనీ ఊహించని షాక్ ఇచ్చింది. రోజూ ఆఫీస్ టైమ్ కంటే ముందే వస్తున్న ఆ యువతిని.. సరైన సమయానికి రావాలని పలుమార్లు పై అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతి.. టైం కంటే ముందే వస్తుండటంతో చివరికి ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆ మహిళ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెక్కింది. అయితే అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైందేనని కోర్టు సమర్థించింది. స్పెయిన్‌(Spain)లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: India US Trade Deal : అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

Spain

లిఖితపూర్వకంగా పలుమార్లు హెచ్చరికలు జారీ

స్పెయిన్‌లోని ఒక లాజిస్టిక్స్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కంపెనీలో పనిచేసే 22 ఏళ్ల మహిళా ఉద్యోగినిని వింత కారణంతో జాబ్ నుంచి తొలగించారు. ఆఫీస్ టైమ్ ఉదయం 7:30 గంటలు కాగా.. ఆమె నిత్యం ఉదయం 6:45 గంటలకే వచ్చేది. 2023 నుంచి.. ఆ కంపెనీ యజమాని ఆ యువతికి నేరుగా, లిఖితపూర్వకంగా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆఫీస్ టైమ్‌కే రావాలని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేదు. అన్నిసార్లు చెప్పినా.. ఆ యువతి 19 సార్లు సమయం కంటే ముందుగానే ఆఫీస్‌కు రావడంతో.. దీన్ని దుష్ప్రవర్తన కింద ఉద్యోగం నుంచి తీసేశారు.

అలికాంటే సోషల్ కోర్ట్‌లో సవాల్

ఆ యువతి అలికాంటే సోషల్ కోర్ట్‌లో సవాల్ చేసింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఆ కంపెనీ వాదనలను విన్నది. అయితే ఆమెకు మొదట్లో నేరుగా చెప్పామని.. ఆ తర్వాత లిఖితపూర్వకంగా కూడా హెచ్చరికలు జారీ చేశామని.. అయినప్పటికీ వినకుండా ఆమె అలాగే ఆఫీసుకు ముందుగా వచ్చిందని.. అందుకే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ తరఫు లాయర్ వాదించారు.అంతేకాకుండా కంపెనీ ఇచ్చిన కారు బ్యాటరీని కూడా ఆ యువతి అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కంపెనీ ఇచ్చిన వివరణను సమర్థించిన కోర్టు.. ఆమె తొలగింపు సరైందేనని తుది తీర్పు ఇచ్చింది. ఇది స్పెయిన్ కార్మికుల చట్టంలోని ఆర్టికల్ 54 ప్రకారం తీవ్ర ఉల్లంఘనగా పరిగణించబడుతుందని కోర్టు తెలిపింది. ఇక ఆఫీసుకు ముందుగా రావడం వల్ల ఉద్యోగం కోల్పోయిన ఈ సంఘటన నెట్టింట తెగ వైరల్ కావడంతో.. ఈ కేసు ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu corporate rules employee rights employment news Google News in Telugu HR practices Latest In telugu news office policies Telugu News Today unfair termination workplace ethics workplace issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.