📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Latest News: Emmy Awards 2025 – అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక‌..

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 1:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే ఎమ్మీ అవార్డుల 77వ (77th Emmy Awards) సిరీస్ వేడుక లాస్‌ ఏంజెల్స్‌లోని పికాక్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. హాలీవుడ్ లోని ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు ఈ వేడుకలో హాజరై వారి సమ్మానాన్ని అందుకున్నారు. ఎమ్మీ అవార్డులు అమెరికన్ టెలివిజన్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రదర్శనలకే కేటాయించబడే గౌరవంగా పరిగణించబడతాయి. వీటిని ప్రతి సంవత్సరం అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Academy of Television Arts and Sciences) ఇవ్వడం ఒక సంప్రదాయం.

ఈ సంవత్సరం నామినేషన్ల జాబితాలో ఎన్నో ప్రసిద్ధ సినిమాలు, వెబ్ సిరీస్‌లు పోటీ పడ్డాయి. వీటిలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైన కొన్ని సిరీస్‌లు ప్రత్యేక గుర్తింపుని పొందాయి. ముఖ్యంగా, ‘అడాల్‌సెన్స్’ సిరీస్ (‘Adolescence’ series) అత్యంత విజయవంతంగా నిలిచింది. ఈ సిరీస్ ఐదు విభిన్న కేటగిరీల్లో అవార్డులను సాధించి రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఈ ఘన విజయం వల్ల దర్శక, నిర్మాతల బృందం మాత్రమే కాక, నటులు కూడా ప్రత్యేక గుర్తింపుని పొందారు.

లెజెండ్స్ సిరీస్

ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకోవ‌డం విశేషం. ఇక ఇందులో నటించిన ఓవెన్‌ కూపర్‌, చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డు గెలుచుకుని కొత్త రికార్డు సృష్టించాడు.ఈ వేడుకలో 2024-2025 సీజ‌న్‌లో ప్ర‌సార‌మైన కార్య‌క్ర‌మాల‌కి అవార్డుల‌ని అందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారమైన అడోలెసెన్స్, ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సిరీస్ అవార్డుల‌ని ద‌క్కించుకున్నాయి. ఇక సెవ‌రెన్స్ డ్రామా సిరీస్‌లో అద్భుత‌మైన న‌ట‌న‌కు గాను ట్రామెల్ టిల్మాన్ ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా అవార్డు అందుకోగా, ఆయ‌న తొలి న‌ల్ల‌జాతి సంత‌తికి చెందిన వ్య‌క్తిగా చ‌రిత్ర సృష్టించారు.

Emmy Awards 2025

ప్రధాన విభాగాలలో విజేత‌ల జాబితా చూస్తే..

ఉత్తమ డ్రామా సిరీస్ : ది పిట్‌ (The Pitt)
ఉత్తమ నటుడు : నోహ్‌ వైల్‌ (ది పిట్‌*)
ఉత్తమ నటి : బ్రిట్నీ లీ లోయర్‌ (సెవెరెన్స్‌)
ఉత్తమ కామెడీ సిరీస్‌ : ది స్టూడియో
ఉత్తమ సిరీస్‌ : అడాల్‌సెన్స్‌ (Adolescence)
సిరీస్ విభాగం అవార్డులు (Adolescence ఆధిపత్యం)
ఉత్తమ నటుడు (సిరీస్‌) : స్టీఫెన్‌ గ్రాహం (అడాల్‌సెన్స్‌)
ఉత్తమ సహాయ నటి (సిరీస్‌) : ఎరిన్‌ డోహెర్టీ (అడాల్‌సెన్స్‌)
ఉత్తమ సహాయ నటుడు (సిరీస్‌) : ఓవెన్‌ కూపర్‌ (అడాల్‌సెన్స్‌)

స్క్రిప్ట్ & దర్శకత్వ విభాగంలో

ఉత్తమ స్క్రిప్ట్ రైటర్‌ : లాస్ట్ వీక్ టునైట్‌.. (సాటర్డే నైట్ లైవ్‌)
ఉత్తమ దర్శకుడు : ఆడమ్‌ రాండాల్‌ (స్లో హార్సెస్‌)
ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్‌ సిరీస్‌) : ఫిలిప్‌ బారంటిని (అడాల్‌సెన్స్‌)

కామెడీ విభాగంలో

ఉత్తమ సహాయ నటుడు (కామెడీ) : జెఫ్‌ హిల్లర్‌ (సమ్‌బడీ సమ్‌వేర్‌)
ఉత్తమ సహాయ నటి (కామెడీ) : హన్నా ఐన్‌బైండర్‌ (హ్యాక్స్‌)
ఉత్తమ రియాలిటీ షో : ది ట్రెయిటర్స్‌

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/what-are-the-collections-of-mirai-in-america/cinema/547474/

77th emmy awards academy of television arts and sciences american television industry Breaking News hollywood celebrities latest news los angeles peacock theater Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.