📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Elon Musk:టెస్లా కంపెనీకి భారీ ప్యాకేజ్.. డ్యాన్స్ చేసిన మస్క్

Author Icon By Pooja
Updated: November 7, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్కు మద్దతు తెలపడమేకాక అతని విజయానికి దోహదం చేశారు. ఆ తర్వాత కొన్నివిషయాల్లో ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించి, ట్రంప్తో విబేధాలను సృష్టించుకున్నారు. దీంతో ట్రంప్, మస్క్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో ట్రంప్ చాలావిషయాల్లో మన్ను పక్కన పెట్టారు. అయితేనేం ఎలాన్ మస్క్ తన బిజినెస్ పై దృష్టిని సారించి, విజయశిఖరాలకు చేరుకుంటున్నారు. తాజాగా టెస్లా కంపెనీ(Tesla Company) నుంచి ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని అందుకుంటున్నారు. ఈ విషయాన్ని కంపెనీ తాజాగా తెలిసింది.

Read Also: Donations 2025: శివ్ నాడార్ కుటుంబం దేశంలో అగ్ర దాతలు

Elon Musk

అయితే భారీ ప్యాకేజీ ఆమోదం పొందిన తర్వాత మస్క్(Elon Musk) డ్యాన్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టెక్సాస్లో టెస్లా వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అతను కంపెనీ తయారు చేసిన ‘ఆప్టిమస్’ అనే హ్యూమనాయిడ్ రోబోట్తో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశారు. మస్క్ డ్యాన్స్ కదలికలను ఆ రోబోట్తో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశారు. మస్క్ డ్యాన్స్ కదలికలను ఆ రోబోట్ కూడా అలాగే అనుకరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ సమావేశం సందర్భంగా మస్క్ కూడా మాట్లాడారు.

రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ రంగంలోకి టెస్లా టెస్లా అనేది కేవలం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ మాత్రమే కాదని తెలిపారు. ఇప్పుడు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. ఆప్టిమస్ రోబోట్ భవిష్యత్తులో డెలివరీ, తయారీ వంటి పనులు కూడా చేస్తుందని తెలిపారు. టెస్లాను ఈవి సంస్థ నుంచి ఏఐ, రోబోటిక్స్ దిగ్గజంగా  మార్చాలని వాటాదారులు అతనికి మద్దతుగా వచ్చే పదేళ్ల కాలానికి దాదాపుగా రూ.878 బిలియన్ల భారీ ప్యాకేజీని ఆమోదించారు. అయితే ఈ భారీ ప్యాకేజీ వల్ల మస్క్ తన దృష్టిని స్పేస్ ఎక్స్ లేదా ఏఐ వంటి ఇతర సంస్థలపైకి మళ్లించకుండా, టెస్లాపైనే ఉంచుతారని వాటాదారులు భావిస్తున్నారు.

తప్పనిసరిగా మస్క్ లక్ష్యాలు చేరుకుంటేనే..

మస్క్ ఈ ప్యాకేజీ మొత్తం దక్కాలంటే తప్పకుండా కొన్ని లక్ష్యాలను తాను చేరుకోవాలి. కంపెనీ 20 మలియన్ల వాహనాలను విక్రవయించాలి. 1 మిలియన్ రోబో టాక్సీలను నడపాలి. అలాగే 1 మిలియన్ రోబోలను అమ్మాలి. వీటితో పాటు కోర్ లాభంలో 400 బిలియన్లు సంపాదించడం వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుతం టెస్లా స్టాక్ విలువ 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి మొదటి 2 ట్రిలియన్ డాలర్లకు, ఆపై 8.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగితేనే మస్క్లు ఈ మొత్తం చెల్లిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu TechNews Tesla TeslaPackage Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.