📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన కీలక దస్త్రాలను (ఎప్స్టీన్ ఫైల్స్) ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందంటూ మస్క్ నేరుగా ట్రంప్‌ను నిలదీయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “ఎప్స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ విడుదల చేయకపోతే ప్రజలు ఆయన్ను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ మంగళవారం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా నేరుగా ప్రశ్నించారు. అంతేకాకుండా తాను కొత్తగా స్థాపించిన ‘అమెరికా పార్టీ’ (America Party)అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో..

ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) ఈ కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలు, ప్రైవేట్ ద్వీపంలో సోదాలు చేసినా ఎలాంటి ‘క్లయింట్ లిస్ట్’ దొరకలేదని, ఈ కేసుకు సంబంధించి ఇకపై ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనపైనే మస్క్ తీవ్రంగా స్పందించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇదే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన ఆ విషయాన్ని దాటవేశారు. “మీరు ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా?” అని విలేకరిని ఎదురు ప్రశ్నించారు. అయితే, గతంలో ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీ ఇద్దరూ ఎప్స్టీన్ నెట్‌వర్క్‌ను బయటపెడతామని హామీ ఇచ్చారు. ఆ జాబితా తన డెస్క్‌పై ఉందని బోండీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.

ట్రంప్ స్పందన – ప్రశ్నలకు దాటవేత
వైట్‌హౌస్ మీడియా సమావేశంలో ఈ అంశంపై విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా, “మీరు ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా?” అంటూ ప్రత్యుత్తరమిచ్చారు. అయితే ఇది ప్రశ్నను తప్పించుకునే ప్రయత్నంగా విమర్శలు ఎదుర్కొంది .

ఎలోన్ మస్క్ కు 14 మంది పిల్లలు ఉన్నారా?
2002 నుండి ఎలోన్ మస్క్ నలుగురు వేర్వేరు మహిళలతో 14 మంది పిల్లలను కన్నారు. అతని మొదటి కుమారుడు 2002లో కేవలం 10 వారాల వయసులో విషాదకరంగా మరణించాడు. అప్పటి నుండి మస్క్ జస్టిన్ విల్సన్, గ్రిమ్స్, షివోన్ జిలిస్ మరియు ఆష్లే సెయింట్ క్లెయిర్ లతో పిల్లలకు తండ్రి అయ్యాడు.
ఎలోన్ మస్క్ నిజమైన జాతీయత ఏమిటి?
ఎలోన్ రీవ్ మస్క్ FRS (జననం జూన్ 28, 1971) దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అతను కెనడాకు వెళ్లి తరువాత US పౌరుడు అయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

#telugu News Donald Trump Elon musk Epstein Files Musk Trump Clash US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.